అక్కడ ఫ్లేవర్డ్ కండోమ్స్ కు భలే గిరాకీ.. వేడినీళ్ళలో వేసి తాగుతున్న యువత; ఎందుకంటే!!

సాధారణంగా గర్భనిరోధక సాధనంగా కండోమ్ లను ఉపయోగిస్తారు. కానీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కండోమ్ లను ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్‌లో కొంతమంది యువకులు ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లకు బానిసలుగా మారారు. అక్కడ ఫ్లేవర్డ్ కండోమ్స్ కు డిమాండ్ ఎక్కువ పెరగడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మత్తు కోసం ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడుతున్న యువత

మత్తు కోసం ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడుతున్న యువత

దుర్గాపూర్ జిల్లాలో చాలా మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలు గా కాకుండా, మత్తుపదార్థాల ఉపయోగిస్తున్నట్లు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వారు కండోమ్ లను వేడినీళ్లలో వేసి ఆ ద్రవాన్ని తాగుతున్నట్టు తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు 10 నుండి 12 గంటల వరకు మత్తులో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇక కండోమ్స్ తో తయారు చేసిన ద్రావణానికి బానిసలుగా మారుతున్న యువత తక్కువ ధర ఉండటంతో వాటిని కొనుగోలు చేసి మత్తుకు వాడుతున్నారు.

ఫ్లేవర్డ్ కండోమ్స్ లో సుగంధ సమ్మేళనాలు.. వేడి నీటిలో వేస్తే ఆల్కాహాల్ గా

ఫ్లేవర్డ్ కండోమ్స్ లో సుగంధ సమ్మేళనాలు.. వేడి నీటిలో వేస్తే ఆల్కాహాల్ గా

గతంలో చాలా తక్కువ సంఖ్యలో అమ్ముడుపోయిన ఫ్లేవర్డ్ కండోమ్స్, ఇటీవల కాలంలో విపరీతంగా అమ్ముడు పోవడంతో అనుమానం వచ్చిన వారు అసలు ఏం చేస్తున్నారు వాటితో అని తెలుసుకునే ప్రయత్నం చేయగా ఈ షాకింగ్ విషయం బయటకు వచ్చింది . ఫ్లేవర్డ్ కండోమ్ లలో సుగంధ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని వేడి నీళ్లలో వేసి నప్పుడు ఆల్కహాల్ గా మారుతాయి. ఈ సుగంధ సమ్మేళనం డెండ్రైట్స్ జిగురులో కూడా కనిపిస్తుంది. చాలా మంది వ్యక్తులు వ్యసనం కోసం డెండ్రైట్‌ను కూడా ఉపయోగిస్తారు.

దుర్గాపూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడకం

దుర్గాపూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఫ్లేవర్డ్ కండోమ్స్ వాడకం

వేడి నీటిలో కండోమ్‌లను చాలాసేపు నానబెట్టడం వల్ల పెద్ద ఆర్గానిక్ అణువులు ఆల్కహాలిక్ సమ్మేళనాలుగా విచ్ఛిన్నం కావడం వల్ల మత్తు వస్తుంది అని దీనికి సంబంధించి కెమిస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. దుర్గాపూర్ లోని దుర్గాపూర్ సిటీ సెంటర్, బెనచిటి, బిధాన్ నగర్, సీ జోన్, ఏ జోన్, ముచ్చిపర వంటి ప్రాంతాలలో ఫ్లేవర్డ్ కండోమ్ ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. గతంలో ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు ప్యాకెట్ లు మాత్రమే అమ్మే దుకాణం దారులు ఇప్పుడు స్టోర్ లో ఫ్లేవర్డ్ కండోమ్ లకు కొరత ఏర్పడిందని చెబుతున్నారు అంటే ఎంతగా విక్రయాలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.

షాప్ లలో జోరుగా ఫ్లేవర్డ్ కండోమ్స్ విక్రయాలు.. పట్టించుకోకుంటే కష్టమే

షాప్ లలో జోరుగా ఫ్లేవర్డ్ కండోమ్స్ విక్రయాలు.. పట్టించుకోకుంటే కష్టమే


ఫ్లేవర్డ్ కండోమ్స్ వినియోగం స్థానికంగా పెరగడంతో, దుర్గాపూర్ ప్రాంతంలోని స్థానికులు, అధికారులు యువత భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యసనం నుండి వీరిని ఏ విధంగా మాన్పించాలి అన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు స్పందించిన దాఖలాలు లేవు. ఫ్లేవర్డ్ కండోమ్స్ మత్తుకు యువత బానిసలుగా మారితే నేరాలు పెరిగే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+