మూడేళ్ళ తర్వాత మూడు వివాహలు చేసుకొన్నట్టు తెలిసి..భర్త ఏం చేశాడంటే...
గుజరాత్ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజుభాయ్ మ్యాట్రిమోనియల్ లో పింకి అనే యువతి ఫ్రోఫెల్ ను చూసి ఆమెను 2013 లో వివాహం చేసుకొన్నాడు.అయితే ఆమెకు అప్పటికే మూడు వివాహలయ్యాయి.
అహ్మదాబాద్:మూడు పెళ్ళిళ్ళు చేసుకొని వాటిని దాచిపెట్టి ఓ వ్యాపారవేత్తను నాలుగో వివాహం చేసుకొంది ఓ మహిళ, వ్యాపారవేత్తకు ఆమెకు ఓ కొడుకు పుట్టాడు. వీరిద్దరికి వివాహం జరిగి మూడేళ్ళు దాటిన తర్వాత మూడు వివాహలు చేసుకొన్న విషయం తెలుసుకొన్న భర్త షాకయ్యాడు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన రాజు బాయ్ ప్రముఖ వ్యాపారి.ఆయన 2013 లో మ్యాట్రిమోనియల్ సైట్ లో పింకి అనే యువతి ప్రోఫైల్ చూసి ఆమెను వివాహం చేసుకొన్నాడు.
వీరిద్దరికి ఓ బాబు కూడ పుట్టాడు.వీరిద్దరూ కూడ ఎంలో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే పింకీకి అప్పటికే మూడు వివాహలయ్యాయి.ఈ వివాహలైన విషయాన్ని పింకీ దాచిపెట్టింది.

అయితే ఓ రోజు పింకీ తన పెళ్ళిళ్ల విషయమై ఫోన్ లో మాట్లాడుతూ భర్త రాజుబాయ్ కు దొరికింది. దీంతో రాజుభాయ్ ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె భర్తతో తీవ్రంగా గొడవపడింది.
అంతేకాదు భర్తతో గొడవ పడి ముంబాయిలోని తన పుట్టింటికి వెళ్ళింది.రాజుబాయ్ కు, తనకు పుట్టిన బిడ్డను చంపేస్తామని ఆమె హెచ్చరిస్తోంది.
తనకు చట్టపరంగా దక్కాల్సిన ఆస్తులు, డబ్బులను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై బాధితుడు రాజు భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications