Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య ప్రైవేట్ పార్ట్స్ సిగరెట్ తో కాలుస్తూ.. భర్త, నలుగురు స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కామాంధులు మారడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే కట్టుకున్న ఇల్లాలిని కాపాడవలసిన భర్తలు కూడా భార్యలపై దారుణమైన ఘటనలకు పాల్పడటం, వారిని చిత్రహింసలకు గురి చేయడం సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇతరులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేస్తున్న భర్తల సంఖ్య కూడా పెరుగుతుంది. వివిధ రకాలుగా సమాజంలో మహిళలు చిత్రహింసలను అనుభవిస్తున్నారు. మానవత్వం మంటగలిసి పోతున్న, రాక్షసత్వం రాజ్యమేలుతోన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇండోర్ లో మహిళపై భర్తతో పాటు మరో నలుగురు స్నేహితులు గ్యాంగ్ రేప్

ఇండోర్ లో మహిళపై భర్తతో పాటు మరో నలుగురు స్నేహితులు గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఓ మహిళపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. కట్టుకున్న భర్తే దారుణ హింసకు పాల్పడటంతో కన్నీటి పర్యంతం అయిన ఆ మహిళ తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే నిందితుల్లో ఒకరు ఆమెకు హాని చేయాలనే ఉద్దేశంతో ఆమెను అనుసరించారని అధికారి తెలిపారు. పోలీసులు చెప్పిన వివరాలలోకి వెళ్తే

స్నేహితులతో కలిసి భర్త అసహజ శృంగారం ..

స్నేహితులతో కలిసి భర్త అసహజ శృంగారం ..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ, ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తిని మ్యాట్రిమోనియల్ సైట్‌లో చూసి వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె జీవితాన్ని ఊహించని విధంగా నరకం చేశాడు. అయితే ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లయిందని ఈ విషయం తెలియక బాధితురాలు మోసపోయింది. 32 ఏళ్ల మహిళ తన భర్త , అతని స్నేహితులతో కలిసి తనతో అసహజ శృంగారం చేసి, రకరకాల చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొంది. తనను శారీరకంగా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రైవేట్ భాగాలను సిగిరెట్ తో కాలుస్తూ... వేధిస్తూ గ్యాంగ్ రేప్

ప్రైవేట్ భాగాలను సిగిరెట్ తో కాలుస్తూ... వేధిస్తూ గ్యాంగ్ రేప్

తన ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాలుస్తూ తనను క్రూరంగా హింసించారని పేర్కొంది.ఎలాగోలా ఫామ్‌హౌస్ నుంచి తప్పించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. లైంగిక వేధింపులను ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను చంపేస్తామని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే విషయాన్ని వెల్లడించిన పోలీసులు బాధితురాలు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు.

ఫామ్ హౌస్ లో సామూహిక అత్యాచారం ,... ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫామ్ హౌస్ లో సామూహిక అత్యాచారం ,... ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

నవంబర్ 2019 మరియు అక్టోబర్ 2021 మధ్య ఇండోర్‌లోని షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలి భర్తతో సహా ఐదుగురిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+