ఎంఏ అమ్మాయి. డ్రైవర్ లవ్ స్టోరి, అప్పటికే పెళ్లి, ఐరన్ బాక్స్ తో కాల్చి నరకం!

బెంగళూరు: అంతకు ముందే పెళ్లి చేసుకుని తరువాత కాలేజ్ అమ్మాయిని ప్రేమించి మాయమాటలు చెప్పి గర్బవతిని చేశాడు. తరువాత మొదటి భార్యకు నచ్చ చెప్పి కాలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రతిరోజూ నరకం చూపించిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగింది.

ఎంఏ పూర్తి చేసిన మంజుల ఫిర్యాదు చెయ్యడంతో ఆమె భర్త, బస్సు డ్రైవర్ రంగనాథ్ స్వామిని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

 కాలేజ్ విద్యార్థుల టూర్

కాలేజ్ విద్యార్థుల టూర్

తుమకూరు జిల్లాలోని ఉర్డిగెరె గ్రామానికి చెందిన మంజుల అనే యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని దేవరహళ్ళి గ్రామానికి చెందిన బస్ డ్రైవర్‌ రంగనాథ్‌ స్వామి విద్యార్థుల బస్‌కు డ్రైవర్‌గా వెళ్లాడు.

 ముగ్గులోకి దింపాడు

ముగ్గులోకి దింపాడు

విహారయాత్రలో డ్రైవర్ రంగనాథ స్వామి కన్ను మంజుల మీద పడింది. బస్సులో ఉన్న సమయంలో మంజులను పరిచయం చేసుకున్నాడు. తరువాత చిన్నగా మంజులను ముగ్గులోకి దింపి నాలుగు సంవత్సరాల పాటు ఆమె వెంటపడి వలవేశాడు.

గర్బవతి అయ్యింది

గర్బవతి అయ్యింది

మంజుల, రంగనాథ స్వామి ప్రేమించుకున్నారు. మంజుల గర్భవతి అయ్యింది. పెళ్లి చేసుకుందామని మంజుల చెప్పింది. ఆ సందర్బంలో రంగనాథ్‌ స్వామి తనకు అప్పటికే పెళ్లి అయ్యిందని చావు కబురు చల్లగా చెప్పాడు.

పోలీసు కేసు భయంతో!

పోలీసు కేసు భయంతో!

మంజుల పోలీసులకు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాలనే భయంతో రంగనాథ్‌ స్వామి తన మొదటి భార్యను ఒప్పించి మంజులను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి రంగనాథ్ స్వామి, అతని మొదటి భార్య కలిసి మంజులను తీవ్రంగా వేధించారు

 ఐరెన్ బాక్స్ తో కాల్చారు

ఐరెన్ బాక్స్ తో కాల్చారు

ప్రతి రోజు రంగనాథ్ స్వామి, అతని మొదటి భార్య కలిసి మంజులను చితకబాదేశారు. అయినా మంజుల భరించింది. కొన్ని రోజుల నుంచి రంగనాథ్ స్వామి మరింత క్రూరంగా ప్రవర్తించాడు. మంజుల మీద ఐరన్ బాక్స్ తో కాల్చి చిత్రహింసలు పెట్టాడు.

పుట్టింటి వాళ్లు తరిమేశారు

పుట్టింటి వాళ్లు తరిమేశారు

మంజుల శరీరం అంతా గాయాలు అయ్యేలా చేశాడు. దాంతో బాధితురాలు మంజుల పుట్టింటికి వెళ్లింది. మమ్మల్ని కాదని పెళ్లి అయిన వాడితో వెళ్లిపోయిన నిన్ను ఇంటిలోకి రానివ్వమని ఆమె కుటుంబ సభ్యులు మంజులను బయటకు పంపించేశారు.

రోడ్డున పడింది

రోడ్డున పడింది

విధిలోని పరిస్థితులో రోడ్డు మీద పడిన మంజుల చిక్కనాయకనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగనాథ్ స్వామి, అతని మొదటి భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+