భార్యను చంపి, బిడ్డ ఎదుటే కాల్చేసి.. డెల్టాప్లస్‌తో చనిపోయినట్లు నమ్మించిన భర్త – ప్రెస్‌రివ్యూ
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భర్తే భార్యను హతమార్చాడని, కన్నబిడ్డ కళ్లెదుటే మృతదేహాన్ని కాల్చేశాడని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. డెల్టాప్లస్ కరోనా సోకిందని, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని, ఆసుపత్రి వారు మృతదేహాన్ని ఇవ్వలేదని భార్య బంధువులను అతడు నమ్మించే ప్రయత్నం చేశాడు.
మృతురాలి అక్క కుమార్తెకు అనుమానం వచ్చి సీసీటీవీ కెమరా ఫుటేజీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.
తిరుపతిలో ఈ నెల 23న వెలుగులోకి వచ్చిన 'సూట్‌కేసులో కాలిన మృతదేహం’ కేసు ఓ కొలిక్కి వచ్చింది. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఎం.శ్రీకాంత్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
భువనేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. కరోనావల్ల వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో మూడు నెలల కిందట వీరు తిరుపతి వచ్చి... డీబీఆర్‌రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో ఏడాదిన్నర వయసు పాపతో కలిసి ఉంటున్నారు.
పెళ్లయినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్ పని చేయక పోవడంతో పుట్టింటి వారికి అనుమానం వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు.
భువనేశ్వరికి డెల్టాప్లస్ వేరియంట్ కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు... అక్కడ ఆమె చనిపోవడంతో తనకు కూడా చూపించకుండా దహనక్రియలు చేసినట్లు చెప్పి... వారిని నమ్మించాడు.
భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లాలో ట్రైనీ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఆమె భువనేశ్వరి ఉన్న అపార్టుమెంట్ సీసీ కెమెరా ఫుటేజీలను తిరుపతి పోలీసుల సహకారంతో రహస్యంగా పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది’’ అని ఈనాడు పేర్కొంది.
- కోవిడ్-19: నిద్ర సరిగ్గా పట్టడం లేదా... ఎందుకో తెలుసుకోండి
- పోలవరంలో ముంపు శాపం... 18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా?
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరు: ఉమెన్ చాందీ
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పష్టం చేశారని వెలుగు దినపత్రిక తెలిపింది.
''తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే.
స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి పెద్దగా కనపడటం లేదు.
చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు ప్రకటించిన సందర్భంగా చిరంజీవి గురించి ఆయన స్పష్టత ఇచ్చారు.
పెట్రోల్ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందన్నారు.
ఈ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొంటారా అంటూ పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించి ఆయన పార్టీలో కొనసాగడం లేదన్నారు’’ అని వెలుగు పత్రిక కథనం పేర్కొంది.
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- అలెగ్జాండర్: 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కడం నుంచి అంతుచిక్కని మరణం వరకు..

ఇంటర్‌లో అందరూ పాస్!
తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది,
''పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థినీ పాస్ చేశారు. దీంతో ఇంటర్‌లో వందశాతం ఫలితాలు వచ్చినట్లయింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా పరీక్షలను రద్దు చేసినందున.. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ ఇచ్చారు.
ప్రాక్టికల్స్‌లో వంద శాతం మార్కులు కేటాయించారు. గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించిన వారికి మాత్రం 35 శాతం పాస్ మార్కులు ఇచ్చారు.
మొత్తంగా రాష్ట్రంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 2,37,441 మంది బాలికలు కాగా, 2,36,409 మంది బాలురు ఉన్నారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు 'డయానా అవార్డు’
కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ప్రతిష్టాత్మక డయానా అవార్డు దక్కిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
''బ్రిటన్ దివంగత రాకుమారి డయానా పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచ వ్యాప్తంగా 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువత చేసిన సోషల్ వర్క్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.
గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా పలు అంశాలపై శోమ పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ మేరకు చేపట్టిన పలు కార్యక్రమాలకుగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తనకు సహకరించిన రెండు గ్రామాల ప్రజలు, తన మెంటార్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుమారుడికి అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు’’ అని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి?
- లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా?
- అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు శత్రువులు, రాజద్రోహులా? :అభిప్రాయం
- భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మావోయిస్టు హరిభూషణ్ మృతి-కరోనా లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- UAPA చట్టం కింద నమోదైన 97.8 శాతం కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications