రోహిత్‌ను కొడుకుగా ఒప్పుకున్న ఎన్డీ తివారీ, ఆహ్వానం

రోహిత్ శేఖర్‌ను తాను తనయుడిగా అంగీకరిస్తున్నానని, డిఎన్ఏ పరీక్షల్లో కూడా అది నిరూపితమైందని తివారి చెప్పారు. ఆదివారం రోహిత్ శేఖర్‌ను తివారి తన నివాసానికి ఆహ్వానించారు. చాలా ఏళ్ల తర్వాత కొడుకుతో మాట్లాడారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి పోవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
కాగా, తన బయోలాజికల్ ఫాదర్ తివారీ అంటూ రోహిత్ శేఖర్ న్యాయస్థానాలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేశారు.
ఎన్డీ తివారీ పితృత్వం కేసు విచారణ ఏళ్ల పాటు విచారణ జరిగింది. రోహిత్ శేఖర్ బయోలాజకల్ ఫాదర్ తివారీ అని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది. అదే వైద్యపరమైన సాక్ష్యం మాత్రమేనని తివారీ తరఫు న్యాయవాది అంతకుముందు కోర్టుల్లో వాదించారు. ఇప్పుడు తివారీ ఆ యువకుడిని తన కొడుకుగా అంగీకరించడం గమనార్హం.












Click it and Unblock the Notifications