వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ భజన చేసిన తమిళనాడు మంత్రి: సీఎం పళని మీద అసంతృప్తి, స్లీపర్ సెల్ మంత్రి కాదు !

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చి చెన్నైలో అడుగుపెట్టిన తరువాత తమిళనాడు మంత్రి సెల్లూర్ కే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చి చెన్నైలో అడుగుపెట్టిన తరువాత తమిళనాడు మంత్రి సెల్లూర్ కే. రాజు ఆమె భజన చేశారు.

చిన్నమ్మ శశికళ లేకుంటే తమిళనాడులో మా ప్రభుత్వం ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు విశ్వాసిగా ఉన్న శశికళ అమ్మ మరణించిన తరువాత పార్టీని చెక్కు చెదరనివ్వకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టారని మంత్రి సెల్లూరు కే. రాజు చిన్నమ్మను ఆకాశానికి ఎత్తేశారు.

I am not sleeper cell minister says sellur Raju

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సెల్లూర్ కే. రాజు మదురైలో చిన్నమ్మ భజన చేశారు. తాను తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నానని, అందుకే ఎక్కువ మాట్లాడలేకుండా పోతున్నానని మంత్రి సెల్లూర్ కే. రాజు విచారం వ్యక్తం చేశారు.

మంత్రి సెల్లూర్ కే. రాజు వ్యాఖ్యలతో తమిళనాడు ప్రభుత్వంతో ప్రకంపనలు పుట్టించాయి. చివరికి తాను స్లీపర్ సెల్ మంత్రిని కాదని, టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వడం లేదని, శశికళ మీద తనకు ఉన్న గౌరవం గురించి చెప్పానని మంత్రి సెల్లూర్ కే. రాజ్ చెప్పడం కొసమెరుపు.

మంత్రి సెల్లూర్ కే. రాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కొంత మంది మంత్రులు అంటున్నారు. మంత్రి సెల్లూర్ కే. రాజ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనంగా ఉన్నారు.

English summary
Tamil Nadu minister for cooperation Sellur Raju said that it was Sasikala who was instrumental in formation of the government, post the death of late chief minister J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X