బీజేపీ అభ్యర్థికి మద్దతంటూ ప్రచారం: ఆర్కే నగర్ ఉప ఎన్నికపై తేల్చేసిన రజినీ

Subscribe to Oneindia Telugu

చెన్నై: తాను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. తాను ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. కాగా, మార్చి 21న ఆర్కే నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గంగై అమరన్ రజినీ‌కాంత్‌ను కలిశారు.

ఈ నేపథ్యంలో రజినీకాంత్ సదరు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అంతేగాక, గంగై అమరన్ కూడా తనకు రజినీ మద్దతు ఉందంటూ చెప్పుకుంటున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో రజినీకాంత్ తన ప్రకటనతో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తమిళ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కెప్టెన్ విజయ్ కాంత్‌లు కూడా ఆర్కేనగర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
South India Super star Rajinikanth on Thursday said that he is not supporting any one, in upcoming RK Nagar by poll.
Please Wait while comments are loading...