పెళ్లి చేసుకోలేదు, వేకెన్సీ బోర్డు లేదు: ఉమాభారతి
న్యూఢిల్లీ: తాను పెళ్లి చేసుకోలేదని, తన జీవితంలో ఇక వివాహానికి చోటు లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. లోక్‌సభ స్పీకర సుమిత్రా మహాజన్ పొరపాటుగా శ్రీమతి' అని సంబోధించడంతో ఆమె పై విధంగా స్పందించారు.
గురువారంనాటి సభలో ప్రకటన చేయాలని కోరుతూ ఉమాభారతిని శ్రీమతిగా పేర్కొన్నారు స్పీకర్. దీనిపై ఉమాభారతి వెంటనే స్పందించారు.

'నేను ఇప్పటికి వరకు పెళ్లి చేసుకోలేదు. భవిష్యత్‌లో కూడా ఆ అవకాశం లేదు. అక్కడ వేకెన్సీ బోర్డు లేదని' ఉమాభారతి అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
స్పీకర్ పొరపాటుకు క్షమాపణ చెప్పి తమ మాటను సవరించుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 56 ఏళ్ల ఉమాభారతిని ' సాధ్వి'గా పేర్కొంటారు.












Click it and Unblock the Notifications