మోడీ మీద నమ్మకం ఉంది, నేను ప్రజల ఎంపీని, ఆ పార్టీ మనిషిని కాదు, సుమలత !

బెంగళూరు: కర్ణాటక వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా నష్ట పరిహారం అందిస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ మీద ఆ నమ్మకం తనకు ఉందని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు సుమలత ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సాంకేతిక సమస్య కారణంతో కన్నడ ప్రజలకు నష్టపరిహారం అందడంలో ఆలస్యం అయ్యిందని, అయితే కచ్చితంగా వరద బాధితులకు న్యాయం జరుగుతుందని ఎంపీ సుమలత అన్నారు. నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయం జేడీఎస్ పార్టీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఎంపీ సుమలత ఆ పార్టీ నాయకులకు ధీటుగా సమాధానం ఇచ్చారు.

భారీ వర్షాలు, వరదలు

భారీ వర్షాలు, వరదలు

మైసూరులో శుక్రవారం మండ్య ఎంపీ సుమలత మీడియాతో మాట్లాడారు. కొన్ని సమస్యల కారణంగా కర్ణాటకకు నష్టపరిహారం అందివ్వడం ఆలస్యం అయ్యిందని సుమలత అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారంగా ఎంత నష్టం జరిగింది అనే విషయం ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని సుమలత గుర్తు చేశారు.

ఎంత నష్టం జరిగింది ?

ఎంత నష్టం జరిగింది ?

కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందని, కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది అని ఒక అంచనా వేశారని తనకు తెలిసిందని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేస్తుందనే నమ్మకం, విశ్వాసం తనకు ఉందని ఎంపీ సుమలత అన్నారు.

ఏం మాట్లాడాలో తెలుసు

ఏం మాట్లాడాలో తెలుసు

తాను ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి అదే అక్కడ మాట్లాడుతానని, ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదో అది మాట్లాడనని సుమలత అన్నారు. హీరోలు దర్శన్, యష్ మండ్య జిల్లాకు వచ్చారా ? లేదా ? అనే విషయం చాల చిన్నదని సుమలత అన్నారు, దర్శర్, యష్ ఎప్పుడు మండ్య జిల్లాకు రావాలో అప్పుడు కచ్చితంగా వస్తారని సుమలత చెప్పారు.

దర్శన్, యష్ వస్తారు

దర్శన్, యష్ వస్తారు

హీరోలు దర్శన్, యష్ ప్రభుత్వ పదవుల్లో లేరని, ఎన్నికల సమయంలో తనకు ప్రచారం చేశారని, వాళ్లకు తప్పకుండా మండ్య జిల్లాకు రావాలనే ఆశ ఉందని సుమలత అన్నారు. హీరోలు దర్శన్, యష్ కచ్చితంగా మండ్య జిల్లాకు వస్తారని, ఇక్కడి ప్రజలతో వారు మాట్లాడుతారని ఎంపీ సుమలత హామీ ఇచ్చారు.

ప్రజల కోసం పని చేస్తా

ప్రజల కోసం పని చేస్తా

ఎంపీగా తను ప్రజలకు ఏం చెయ్యాలో అది కచ్చితంగా చేస్తానని సుమలత వివరించారు. తాను ఎంపీ అయ్యింది జేడీఎస్ నాయకులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదని సుమలత ఆ పార్టీ నాయకులకు ధీటుగా సమాధానం ఇచ్చారు.

నేను ప్రజల మనిషి

నేను ప్రజల మనిషి

సుమలత ఎక్కడ ఉన్నారు అని జేడీఎస్ నాయకులు తనను ప్రశ్నిస్తున్నారని, వారికి సమాధానం చెప్ప వలసిన అవసరం తనకు ఏమాత్రం లేదని సుమలత అన్నారు. తనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించిన ప్రజలకు తాను సమాధానం చెప్పాలని, వారి సమస్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు ఉందని సుమలత చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+