నేను ఆ రెండింటి బాధితురాలిని: డీఎస్పీ అనుపమ
బెంగళూరు: కర్నాటక వ్యాప్తంగా కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా సంచలనం రేపింది. దీనిపై తాజాగా ఆమె పెదవి విప్పారు. గురువారం నాడు ఆమె మాట్లాడుతూ... తాను వ్యవస్థ, పురుషాధిక్య వ్యవస్థ, అవినీతి రాజకీయాలకు బలైన బాధితురాలినని వ్యాఖ్యానించారు.
కర్ణాటక మహిళా కమిషన్ సభ్యుల ముందు తన వాదనలు వినిపించిన అనంతరం ఆమె మాట్లాడారు. బళ్లారి ఎస్పీ చేతన రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పని చేయాలంటూ వేధింపులకు గురి చేసేవారన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే ఆమె రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

పురుషాధిక్య సమాజంలో అవినీతి రాజకీయాలకు మహిళా ఉద్యోగులు వేధింపుల బారిన పడకుండా తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఉద్యోగంలో మనశ్సాంతి లేకుండా పోయిందని, ఇప్పుడు అది దొరికిందన్నారు. పురుషుల ఆలోచనల ప్రకారమే నడుస్తోందన్నారు.
తనకు ఉద్యోగం ఎలాంటి మానసిక ప్రశాంతతను ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం తనకు దొరికిందన్నారు. కాగా, ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్టు మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు.
కాగా, కుడ్లిగి డీఎస్పీగా పని చేసిన అనుపమ షణై మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆమె విసిరిన సవాళ్లతో ఆయన మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications