ప్రేమ,ఆప్యాయతలను నమ్ముతా, రాజ్యాంగంపై నమ్మకం: మేవానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాజ్యాంగంపట్ల తమకు నమ్మకం ఉందని రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని దళిత నేత, గుజరాత్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అన్నారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం నిర్వహించిన 'యువ హుంకార్' ర్యాలీలో జిగ్నేష్ పాల్గొన్నారు.

'లవ్ జీహాద్, గైలను మేము ప్రేమించడం లేదన్నారు. ప్రేమ ఆప్యాయతలను మేము నమ్ముతామని మేవానీ చెప్పారు.ఫిబ్రవరి 14ను సెలబ్రేట్ చేసుకుంటామని మేవానీ అన్నారు.

I don't believe in 'love jihad', we're 'pyaar ishq' guys: Mevani at Delhi rally

అవినీతి, పేదరికం, నిరుద్యోగం వంటి అసలు సిసలైన అంశాలను చాప కింద దాచిపెట్టి, ఘర్‌వాపసి, లవ్ జీహాద్, ఆవులు వంటి అంశాలను తెరపైకి తీసుకురావడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. భీమ-కొరేగావ్ హింసాకాండకు సమాధానం చెప్పాల్సింది తాను కాదన్పారు.

కోరేగావ్ హింసాకాండకు ప్రధాని మోదీనే సమాధానమివ్వాలని మేవాని అన్నారు. షహరాన్‌పూర్‌, భీమా కోరోగావ్‌లలో దళితులపై హింసాకాండ వెనుక ఎవరున్నారో, రోహిత్ వేముల ఎందుకు మరణించాడో చెప్పాలన్నారు.

ఇండియన్ల విదేశీ ఖాతాల సొమ్మును ప్రజలకు ఎందుకు తెచ్చి ఇవ్వలేకపోతున్నారో ప్రధానే సమాధానం చెప్పాలని మేవానీ డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Narendra Modi government poses a "threat" to the country's democracy and Constitution, Dalit leader Jignesh Mevani said today at a youth rally for which the Delhi Police had refused permission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి