రాజ్యసభకు నాగబాబు, కేంద్ర మంత్రిగా ఛాన్స్ - బాలినేనికి ఎమ్మెల్సీ పదవి..!?
రంగా కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ లోనూ భాగస్వామి కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జనసేనకు బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఆహ్వానం అందింది. అనూహ్యంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేన నుంచి నాగబాబుకు అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఇక.. మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్సీ కానున్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కొత్త లెక్కలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో తాను డిప్యూటీ సీఎం గా ఉండటంతో.. కేంద్ర మంత్రివర్గంలోకి తన పార్టీ నుంచి సోదరుడు నాగబాబును పంపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో జనసేన కు ఒక సీటు దక్కనుంది. ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలోనే నాగబాబు ను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు చివరి నిమిషంలో అవకాశం కోల్పోయారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ.. ఏపీ మంత్రివర్గం లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఈ సమయంలోనే మారుతున్న సమీకరణాల్లో పవన్ తన సోదరుడిని ఢిల్లీకి పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన..!?
జూన్ 10న ఎన్డీఏ పాలిత సీఎంలు.. డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన దిశగా మోదీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ నుంచి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని.. జనసేనకు ఛాన్స్ ఇచ్చేలా మంత్రాంగం సాగుతున్నట్లు పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా నాగబాబుకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో మంత్రిగా చేయాలనుకున్నా.. స్థానిక సమీకరణాలతో పెండింగ్ లో ఉంచారు.
ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవి పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక, మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తే... నాగబాబు ఎమ్మెల్సీ సీటు మాజీ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బాలినేనికి అవకాశం దక్కే అవకాశం ఉంది. తాజాగా బాలినేనికి ప్రాధాన్యత ఉంటుందని పవన్ సైతం స్పష్టం చేసారు. దీంతో.. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ నిర్ణయాలు అమలు జరిగే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications