యుఎస్‌లో డిటర్జెంట్‌పౌడర్ అమ్మిన స్నాప్‌డీల్ కోఫౌండర్

న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ వెబ్ సైట్స్‌లో ఒకటైన స్నాప్ డీల్ సహ వ్యవస్ధాపకుడు కునాల్ బహల్ అమెరికాలో డిటర్జెంట్ పౌడర్ అమ్మారట. ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపారంలో మంచి ప్రగతిని సాధించిన స్నాప్ డీల్‌కు దిశా నిర్దేశం చేస్తున్న కునాల్ ఒకప్పుడు అమెరికాలో డిటర్జెంట్ పౌడర్ అమ్మారు. అమెరికాలో బిజినెస్ స్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన డిటర్జెంట్ పౌడర్ విక్రయించారట.

కొందరి కలిసి డిటర్జెంట్ పరిశ్రమ స్థాపించిన ఆయన, తన ఉత్పత్తులను స్వయంగా సూపర్ మార్కెట్లకు తీసుకెళ్ళేవారు. అటుపై, అనేక వ్యాపారాలు చేసిన కునాల్, రోహిత్ బన్సల్ తో కలిసి స్నాప్ డీల్.కామ్ ను స్థాపించారు. ఇక ప్రస్తుతం ఆన్ లైన్ వ్యాపారంలో స్నాప్ డీల్ ఏ స్ధాయికి చేరుకుందో అందిరికి తెలిసిందే.

స్నాప్ డీల్ ప్రారంభించిన కొద్ది రోజులకే తమ కంపెనీ 400 మిలియన్ అమెరికన్ డాలర్ల సంస్ధగా అవతరించిందని ఆయన అన్నారు. వంద కోట్ల రూపాయలను వ్యాపార కార్యకలాపాల కోసం, మూడు బిలియన్ డాలర్లను ఈ కామర్స్ మార్కెటింగ్ కోసం పెట్టుబడిగా పెట్టామని కునాల్ తెలిపారు.

I don't lose sleep over competition: Kunal Bahl

గత రెండేళ్లలో స్నాప్ డీల్ 600 శాతం వృద్ధిని సాధించిందని కునాల్ తెలిపారు. అంతేకాకుండా టాటా కంపెనీల గౌరవ అధ్యక్షుడు రతన్ టాటా తమ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారని సీఈఓ కునాల్ బెహల్ తెలిపారు.

ఐతే రతన్ టాటా ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక స్నాప్ డీల్.కామ్‌లో జపాన్‌కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థ సాప్ట్ బ్యాంక్ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో, రూ.3,762 కోట్లు పెట్టుబడిగా రానున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది.

భారత్ కు చెందిన ఓ ఆన్ లైన్ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+