ఆసిస్‌తో గెలుస్తాం, ప్రపంచ కప్ మనదే: శ్రీశాంత్
తిరువనంతపురం: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ పైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొహాలీలో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు.
భారత జట్టుకు విజయం చేకూరాలని అతను విజయ సంకేతం చూపించాడు. నేడు జరగనున్న మ్యాచులో భారత్ కచ్చితంగా గెలుస్తుందని, ప్రపంచ కప్ కూడా మనదేనని చెప్పాడు. తొలి ట్వంటీ 20 ప్రపంచ కప్ నెగ్గడంలో శ్రీశాంత్ కీలక పాత్ర పోషించాడు.

పటిష్ట ఆస్ట్రేలియా జట్టుకు ఆ ప్రపంచ కప్‌లో చుక్కలు చూపించాడు. మ్యాచ్ నేపథ్యంలో పాత విషయాలను అతను గుర్తు చేసుకున్నాడు. 2007 ట్వంటీ 20 ప్రపంచ ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో పాక్ బ్యాట్సుమెన్ మిస్బా ఇచ్చిన క్యాచ్ శ్రీశాంత్ పట్టే దృశ్యం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.












Click it and Unblock the Notifications