పక్షిలా ఎగరాలనుకున్నా: ఐదో క్లాస్‌లో కలామ్
హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ తన చిన్ననాటి విషయాలను చాలా ఆసక్తికరంగా చెప్పేవారు. విద్యార్థులకు స్పూర్తి ప్రదాతగా ఆయన నిలిచారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పిల్లలకు అంత దగ్గరగా వెళ్లింది భారతదేశంలో కలామ్ మాత్రమేనంటే అతిశయోక్తి కాదేమో.
తాను ఎగరాలని అనుకున్నట్లు డాక్టర్ అబ్దుల్ కలామ్ చెప్పారు. అది కూడా ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు. "నేను 1941లో ఐదో తరగతి చదువుతున్నాను. సైన్స్ టీచర్ సుబ్రమణ్యం తరగతి గదిలోకి వచ్చారు. ఆయన జీవితంలో పవిత్రతను, విజ్ఞానాన్ని తరగతి గదిలోకి తెచ్చారు" అని కలామ్ ఒక సందర్బంలో బాల్య జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

"ఆయన ఎగురుతున్న పక్షి బొమ్మను గీశారు. అది ఎలా ఎగురుతుందో వివరించారు. ఆ రోజు పక్షి ఎలా ఎగురుతుందో తెలుసుకోవడమే కాకుండా నా జీవిత లక్ష్యాన్ని మార్చింది. నేను ఎగరాలని అనుకున్నాను" అని ఆయన వివరించారు.
కల నెరవేరింది....
"నేను పైలట్‌ను కావాలని అనుకున్నాను. నాకు పదో స్థానం వచ్చింది. అక్కడ తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో పరీక్ష రాయలేకపోయాను. కొన్ని సార్లు నువ్వు ఏం కోరుకుంటావో అది లభించదు" అని చెప్పారు. "2002లో నన్ను భారతీయ నాయకులు రాష్ట్రపతివి కా అన్నారు. నేను ఒకె చెప్పాను" అని ఆయన వివరించారు.
2005లో ఎయిర్ స్టాఫ్ చీప్ తన వద్దకు వచ్చాడని, పైలట్ కావాలనే కోరిక తాను తీర్చుకోలేకపోయానని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. "శిక్షణ తీసుకోవాలని ఎయిర్ చీఫ్ చెప్పారు. చివరకు 2007లో 30 నిమిషాల పాటు ఎగిరాను" అని ఆయన వివరించారు.
సందేశం ఏమిటంటే, "నువ్వు కలలు కంటే, జీవితంలో లక్ష్యం ఉంటే, విజ్ఞానాన్ని పొంది, తెలుసుకుంటే, కఠిన శ్రమ చేస్తే సమస్యను ఎదుర్కుని విజయం సాధిస్తావు" అని అబ్దుల్ కలామ్ చెప్పారు.












Click it and Unblock the Notifications