Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి జనార్దన్ రెడ్డి డ్రీమ్స్ ఇవే: సంచలన వ్యాఖ్యలు, ఆంధ్రా, తెలంగాణపై కన్ను, ఎన్నికల్లో !

కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనకురెండు కోరికలు ఉన్నాయని అంటున్నారు. తన రెండు కోరికలు తీర్చుకోవడానికి శక్తి వంచనలేకుండా పని చేస్తానని,

బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనకురెండు కోరికలు ఉన్నాయని అంటున్నారు. తన రెండు కోరికలు తీర్చుకోవడానికి శక్తి వంచనలేకుండా పని చేస్తానని, బీజేపీలో ఓ కార్యకర్తగా పని చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి తన 25వ వివాహవార్షికోత్సవం జరుపుకోవడానికి ఇటీవల బళ్లారీ వెళ్లారు. కోర్టు అనుమతితో బళ్లారీ వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి అక్కడ తన కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుని మంగళవారం (జూన్ 6వ తేదీ) బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్బంగా గాలి మీడియాతో మాట్లాడారు.

గాలి జనార్దన్ రెడ్డి మొదటి కోరిక ఇదే !

గాలి జనార్దన్ రెడ్డి మొదటి కోరిక ఇదే !

2019లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని మళ్లీ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీ రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని తాను చూడాలని అది తన చిరకాల కోరిక అని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

గాలి రెండో కోరిక వింటారా ?

గాలి రెండో కోరిక వింటారా ?

2018లో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటోందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు బీఎస్. యడ్యూరప్పను సీఎం చెయ్యడం తన రెండో కోరిక అన్నారు. బీజేపీ కార్యకర్తగా తాను ఆ పని చేస్తానని, కర్ణాటక మొత్తం తిరిగి బీజేపీ తరపున ప్రచారం చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రా, తెలంగాణపై కన్నుపడింది !

ఆంధ్రా, తెలంగాణపై కన్నుపడింది !

కర్ణాటకతో సహ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటోందని, అందులో ఎలాంటి సందేహం లేదని గాలి జనార్దన్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నరేంద్ర మోడీ హవా ఉందని, కచ్చితంగా రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తోందని గాలి జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యను !

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యను !

2018లో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడం లేదని గాలి జనార్దన్ రెడ్డి బాంబు పేల్చారు. బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. తాను ఎప్పటికీ బీజేపీ కార్యకర్తగానే ఉంటానని అన్నారు.

కుటుంబ సభ్యుల విషయంలో !

కుటుంబ సభ్యుల విషయంలో !

వచ్చే శాసన సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారా ? లేదా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బళ్లారీ జిల్లాతో సహ ఉత్తర కర్ణాటకలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

మాజీ సీఎం కుమారస్వామి !

మాజీ సీఎం కుమారస్వామి !

అక్రమ మైనింగ్ కు అవకాశం కల్పించే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి జంతకల్ మైనింగ్ లీసింగ్ నవీకరణ చేసే సమయంలో భారీ మొత్తంలో లంచం తీసుకున్నారని అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలు చేశారు. దాదాపు రూ. 150 కోట్లు లంచం తీసుకుని కుమారస్వామి జంతకల్ మైనింగ్ కు అవకాశం కల్పించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

రూ. 150 కోట్ల లంచం, సాక్షాలు !

రూ. 150 కోట్ల లంచం, సాక్షాలు !

మంగళవారం బెంగళూరులో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) అధికారుల ముందు గాలి జనార్దన్ రెడ్డి హాజరైనారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మీద చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్షాలు ఎస్ఐటీ అధికారులకు సమర్పించడానికి గాలి జనార్దన్ రెడ్డి ఎస్ఐటీ అధికారుల ముందు హాజరైనారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చిన సాక్షాల వివరాలను అధికారులు గోప్యంగా పెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+