సర్జికల్ స్ట్రైక్ 2: ఈ ఆపరేషన్ మొత్తం ఖర్చు ఎంత, దేని ఖరీదు ఎంత?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి పదకొండు రోజుల తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. ఎల్ఓసీ వెంట ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో దాడులు చేసింది. వైమానిక బృందం సోమవారం వేకువజామున మూడున్నర గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్ గైడెడ్ బాంబులతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది.

బాంబుల ఖరీదు రూ.1.7 కోట్లు
12 మిరాజ్ 2000 జైట్ ఫైటర్స్‌తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 21 నిమిషాల్లో తమ టార్గెట్‌ను పూర్తి చేశాయి. పాక్‌లోని పలు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జైష్ ఏ మొహమ్మద్ వంటి కీలక, అతిపెద్ద ఉగ్రవాద స్థావరం నాశనం అయింది. ఉగ్రవాద దాడుల నాశనం చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన లేజర్ గైడెడ్ బాంబుల ఖరీదు దాదాపు రూ.1.7 కోట్లు. పాక్‌లోకి దాడుల కోసం వెళ్లిన ఫైటర్ జెట్స్ సహా అన్నింటి విలువ రూ.2,568 కోట్లు.

ఒక్కో బాంబు ఖరీదు రూ.56 లక్షలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1000 కిలోల బాంబులు జారవిడిచి, ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేశారు. ఈ ఒక్కో బాంబు ఖరీదు రూ.56 లక్షలు. ఈ బాంబులను బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీ ప్రాంతాల్లో జారవిడిచారు. ఈ దాడిలో 200 నుంచి 300 మంది తీవ్రవాదులు చనిపోయారు.

ఆపరేషన్ కోసం రూ.6,300 కోట్లు ఖర్చు
కాగా, ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూ.6,300 కోట్ల మిలిటరీ అసెట్స్‌ను ఉపయోగించింది. ఇందులో రూ.3,686 కోట్ల అసెట్స్ వినియోగించలేదు. ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్) సర్వేలియెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్‌కు రూ.1750 కోట్లు అయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వాయుదళాలపై కన్ను వేశాయి. ఇక, ఇల్యూషన్ మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ట్యాంకర్ విలువ రూ.22 కోట్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరాన్ సర్వెలియన్స్ డ్రోన్ విలువ రూ.80 కోట్లు. ఇవి కూడా ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి.

ఒక్కో మిగ్ 29ఎస్ విలువ రూ.154 కోట్లు
రష్యన్ మేడ్ సుఖోయ్ సు 30ఎంకేఐ ఎయిర్ సుపరియేటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు మూడు. పాల్గొన్నాయి. వీటి ఒక్కో దాని విలువ రూ.358 కోట్లు. 5 మిగ్ 29ఎస్‌లు ఉన్నాయి. ఒక్కో మిగ్ 29ఎస్ విలువ రూ.154 కోట్లు. పన్నెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాగ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ విలువ రూ.214 కోట్లు. ఇవి ఈ ఆపరేషన్‌లో అతి కీలకంగా పని చేశాయి. ఇవి గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి 225 కేజీల జీబీయూ12 లేజర్ గైడెడ్ బాంబులను తీసుకెళ్లాయి.

జీబీయూ విలువ రూ.14 లక్షలు
ఒక్కో జీబీయూ12 పేవ్‌వే II (గైడెడ్ బాంబ్ యూనిట్) 225 కేజీల వార్‌హెడ్‌ను తీసుకు వెళ్తుంది. ఒక్కో దాని విలువ రూ.14 నుంచి రూ.14.7 లక్షలు. జీబీయూ12 ను అమెరికా 1976లో తీసుకు వచ్చింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4 నుంచి 5 బాంబులు ఉపయోగించింది. ఒక్కో బాంబు విలువ రూ.56 లక్షల నుంచి రూ.73.5 లక్షలు. కానీ పైలట్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఖరీదు మాత్రం వెలకట్టలేం.












Click it and Unblock the Notifications