దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

ఇదీ భారత వైమానిక దళం సత్తా! ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు!

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లక్నో: ఆగ్రాలోని ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు ఎక్స్ ప్రెస్ హైవేపై దిగడం ఆగ్రా పరిసరాల్లోని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

  యుద్ధ సమయాల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా ఇక్కడి జాతీయ రహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలిసారి నడిరోడ్డుపై యుద్ధ విమానాలు ఈ విన్యాసాలు చేశాయి.

  చూసేందుకు పోటీపడ్డ స్థానికులు...

  చూసేందుకు పోటీపడ్డ స్థానికులు...

  మంగళవారం తెల్లవారుజామున ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రా దగ్గర ఢిల్లీ-లక్నో జాతీయ ఎక్స్ ప్రెస్ హైవేపై యుద్ధవిమానాలు విన్యాసాలు ప్రారంభమయ్యాయి. వీటిని చూసేందుకు స్థానికులు రోడ్డుకిరువైపులా బారులుతీరారు.

  జాతీయ రహదారులపై కూడా ల్యాండింగ్...

  ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు రన్ వేలు చాలా ఉపయోగపడతాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

  తొలిసారిగా సూపర్ హెర్క్యులెస్...

  తొలిసారిగా సూపర్ హెర్క్యులెస్...

  ఈ యుద్ధ విన్యాసాల్లో భాగంగా తొలిసారిగా ఓ సూపర్ హెర్క్యులెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్ ప్రెస్ హైవే పై ల్యాండ్ అయింది. ఈ యుద్ధ విమానం దాదాపు 200 మంది కమాండోలను మోసుకెళ్లగలదు. 2010లో భారత వైమానిక దళంలో చేరిన ఈ రకం యుద్ధవిమానాల ధర ఒక్కోటి రూ.900 కోట్లు.

  విన్యాసాల్లో జాగ్వార్, మిరాజ్, సుఖోయ్...

  విన్యాసాల్లో జాగ్వార్, మిరాజ్, సుఖోయ్...

  మంగళవారం నాటి విన్యాసాల్లో 3 జాగ్వార్ యుద్ధ విమానాలు, ఆరు మిరాజ్ 2000 యుద్ధవిమానాలు, 3 సుఖోయ్ 30ఎంకేఐ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. గగన వీధుల్లో విహరిస్తూ, విచిత్రమైన విన్యాసాలు ప్రదర్శిస్తూ భారత వైమానిక దళం సామర్థ్యాన్ని ఇవి దర్పణం పడుతూ వీక్షకులకు అమితానందాన్ని కలుగజేశాయి.

   గతంలోనూ...

  గతంలోనూ...

  భారతీయ వైమానిక దళానికి ఈ రకం విన్యాసాలు కొత్తేం కాదు. 2015 మే నెలలో ఒకసారి ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఢిల్లీ సమీపంలో యమున ఎక్స్ ప్రెస్ హైవేపై మిరాజ్ 2000 యుద్ధ విమానాన్ని సురక్షితంగా దించారు. ఆ తరువాత 2016 నవంబర్ లో కూడా ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై మిరాజ్ 2000 యుద్ధవిమానంతోపాటు సుఖోయ్ యుద్ధ విమానాన్ని కూడా దించి, టేకాఫ్ తీసుకున్నారు.

  English summary
  The Indian Air Force started the aircraft touchdown exercise on the Agra Expressway near Bangarmau in Unnao district about 65 km from Uttar Pradesh capital Lucknow on Tuesday. The exercise is being conducted to test the capability of the IAF to land its fighter jets on highways in the event of an emergency or in a war-like situation. This is the first time a transport aircraft - a Super Hercules, which can carry 200 commandos - is landing on an expressway. Inducted into the air force in 2010, each plane costs nearly Rs 900 crore. Three Jaguar deep penetration strike aircraft will be the first to land, followed up by six Mirage 2000 aircrafts flying in two formations and then, two more formations of three aircraft each of Sukhoi-30MKI.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more