రూ. 129 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసిన ఐఏఎస్ రవి

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి హత్య కేసును 11 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టుం నివేదిక అందిన తరువాత కేసు దర్యాప్తుకు కచ్చితమైన క్లూ చిక్కుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. తరువాత రవి మృతదేహాన్ని బెంగళూరులోని నాగరబావి దగ్గర ఉన్న ఆయన మామ ఇంటికి దగ్గరకు తరలించారు.

దర్యాప్తు ముమ్మరం..... ఆ ముగ్గురు ఎవ్వరు......!

సోమవారం రవి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ దగ్గరకు ముగ్గురు వ్యక్తులు వెళ్లి తాము వాణిజ్య పన్నుల శాఖ అధికారులమని చెప్పారని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అపార్ట్ మెంట్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిలు, లాంగ్ బుక్ ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రవి కారు డ్రైవర్, అపార్ట్ మెంట్ సెక్యూరిటి గార్డులను విచారణ చేశారు. అదే విధంగా రవి సోమవారం కార్యాలయం దగ్గరకు వెళ్లారు. కార్యాలయంలోని సిబ్బందితో ఎంత సేపు మాట్లాడారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

IAS officer D K Ravi collected Rs 200 crores arrears

దాడులు జరిగింది ఈ కార్యాలయ మీదే..........!

వాణిజ్య పన్ను చెల్లించని రియల్ ఎస్టేట్ కార్యాలయాల మీద డి.కే. రవి తన సిబ్బందితో కలిసి దాడులు చేసి రికార్డులు స్వాదీనం చేసుకున్నారు. బెంగళూరులోని పలు సంస్థలపైనే కాకుండా ఒక మంత్రికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయం మీద దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

రూ. 129 కోట్లు వసూలు............!

వాణిజ్య పన్నుల శాఖలో విధులు చేపట్టిన తరువాత డి.కే. రవి తన సిబ్బందితో కలిసి కేవలం నాలుగు నెలలలో ఈ కంపెనీల నుండి రూ. 129 కోట్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అంతే కాకుండ కోలారు జిల్లాలో బడాబాబులు ఆక్రమించిన 200 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొవడానికి శక్తి వంచన లేకుండా పని చేశారు.

భూ మాఫియా, ఇసుక మాఫియా ముఠాల నుండి బెదిరింపులు...........!

వాణిజ్య పన్నలు శాఖలో విధులు చేపట్టిన తరువాత ఐఏఎస్ అధికారి రవికి భూ మాఫియా, ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. వాణిజ్య పన్నలు శాఖ నుండి బదిలీ చేయించుకుని వెంటనే ఎక్కడికైనా వెళ్లిపోవాలని లేదంటే ప్రాణాలు ఉండవని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంలో రవి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+