Netflix కు కేంద్రం సమన్లు
IC 814 The Kandahar Hijack: దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వెబ్ సిరీస్.. ఐసీ 814 ది కాందహార్ హైజాక్. కిందటి నెల 29వ తేదీన టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన థ్రిల్లర్ డ్రామా. 1999లో పాకిస్తాన్‌కు చెందిన హర్కత్-వుల్-ముజాహిదీన్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేసిన ఉదంతం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అనుభవ్ సిన్హా దర్శకుడు.
ఆ ఫ్లైట్ కేప్టెన్ దేవీ శరణ్, కోపైలెట్ సృంజన్ చౌదరి అనుభవాలను ఆధారంగా చేసుకుని దీన్ని చిత్రీకరించాడు దర్శకుడు. నేపాల్‌లోని ఖాట్మండూ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ విమానాన్ని ముజాహిదీన్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు. భారత్‌లో ఖైదీలుగా ఉన్న అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజర్, ముష్తాక్ అహ్మద్‌ను విడిపించాలనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్నలోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్‌ను తీసుకెళ్లారు.

ఆ ఉదంతాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చేలా ఈ సిరీస్ తెరకెక్కింది. నజీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ, దియా మీర్జా, అరవింద్ స్వామి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ.. కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కిందటి నెల 29వ తేదీన విడుదల అయింది.
ఇప్పుడిది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సిరీస్‌ను టెలికాస్ట్ చేస్తోన్నందుకు కేంద్ర ప్రభుత్వం సమన్లను జారీ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా సెహెగల్‌కు వాటిని అందజేసింది. ఈ సిరీస్‌లో ఇద్దరు హైజాకర్లకు హిందువుల పేర్లు పెట్టడం పట్ల కేంద్రం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
ఈ సిరీస్‌లో కనిపించిన అయిదుమంది ఉగ్రవాదుల పేర్లు- చీఫ్, డాక్టర్, బర్గర్, భోళా, శంకర్. హిందూమతాన్ని ప్రతిబింబించేలా భోళా, శంకర్ అనే పేర్లు హర్కతుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు పెట్టడం.. వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం అధినేత అమిత్ మాలవీయ ఘాటు విమర్శలు చేశారు. దర్శకుడు అనుభవ్ సిన్హా ఉద్దేశపూరకంగానే ఉగ్రవాద పాత్రధారులకు ముస్లిమేతర పేర్లు పెట్టారంటూ మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను వక్రీకరించారంటూ ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా సెహెగల్‌కు సమన్లు ఇచ్చింది. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశించారు. తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఇండియాటుడే ఓ కథనాన్ని ప్రచురించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications