మాంసం తిని దేవాలయంలోకి సీఎం, పంది మాంసం తిని మసీదుకు వెళ్తావా: మాజీ మంత్రి సవాల్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు దమ్ముంటే పంది మాంసంతో భోజనం చేసి మసీదులోకి వెళ్లి రావాలని కర్ణాటక మాజీ మంత్రి సోగడు శివణ్ణ సవాలు చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసి తనను తాను సమర్థించుకున్న సిద్దరామయ్య ఇప్పుడు అలాగే ప్రవర్నిస్తే ప్రజలు కూడా నమ్ముతారని మాజీ మంత్రి సూచించారు.

మంగళవారం తుమకూరులో విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి సోగుడు శివణ్ణ సిద్దరామయ్యను తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఆదివారం దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళలో మాంసం, చేపల కూరతో ఆహారం సేవించిన సిద్దరాయయ్య, కొందరు మంత్రులతో కలిసి పవిత్రమైన ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలం వెళ్లారు.

If chief minister Siddaramaiah has guts, after eating pork ask him to enter mosque, Sogadu Shivanna

ధర్మస్థలంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దరామయ్య తరువాత మంత్రులతో కలిసి అక్కడ శ్రీ మంజునాథ స్వామి (శివుడు)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాంసం తిని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలం వెళ్లడమే కాకుండ దేవుడిని ఎలా దర్శించుకుంటారని పలువురు హిందూ సంఘ, సంస్థల ప్రతినిధులు ప్రశ్నించారు.

ఈ విషయంపై స్పంధించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన ఆహార అలవాట్లు ఇలాగే ఉంటాయని, మాంసం తిని దేవుడిని దర్శించుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. తాను భక్త కన్నప్పను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పిన సిద్దరామయ్య ఆయన చేసిన పనిని సమర్థించుకున్నారు.

ఈ విషయంలో సీఎం సిద్దరామయ్యను మాజీ మంత్రి సాగడు శివణ్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. సిద్దరామయ్య స్వార్థం కోసం మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, అధికారం కోసం ఎంత మందిని అయినా బలి చెయ్యడానికి ఆయన సిద్దంగా ఉన్నారని ఆరోపించారు.

మాంసం తిని దేవాలయానికి వెళ్లారు, పంది మాంసం తిని మసీదు, దర్గాకు వెళ్లి వచ్చి ఇప్పుడు చెప్పినట్లే తరువాత చెప్పాలని సీఎం సిద్దరామయ్యకు సవాలు చేశారు. ధర్మస్థలంలోని శ్రీ మంజునాథ స్వామికి దేశ, విదేశాల్లో కోట్లాది మంది భక్తులు ఉన్నారని మాజీ మంత్రి సోగడు శివణ్ణ ఇదే సందర్బంలో గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If chief minister Siddaramaiah has guts, after eating pork ask him to enter mosque, former minister Sogadu Shivanna challenges in press meet at Tumakuru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి