వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీ ఆట మొదలైంది: తలైవా అభిమానోత్సాహం: గ్రౌండ్ వర్క్ లో, యుద్ధానికి సిద్దమా!

తలైవా రాజకీయాల్లోకి వస్తారన్న ఆశాభావంతో ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించే పనిలో పడ్డారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తలైవా (రజనీకాంత్) రాజకీయాల్లోకి వస్తారన్న ఆశాభావంతో ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించే పనిలో పడ్డారు. యుద్దానికి సిద్దం కావాలని రజనీకాంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము సిద్దంగానే ఉన్నామని, మీదే అలస్యం అంటూ ఆయన అభిమానులు నినాదాన్ని అందుకుంటున్నారు.

తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఇప్పటికే వార్డుల వారీగా సంఘాల ఏర్పాటు చేస్తూ దూసుకెళుతున్నారు. తలైవా ఎప్పుడు పిలుపునిచ్చినా అందుకు సిద్దంగా ఉండే విధంగా ఇప్పుడే తమను తాము తయారు చేసుకుంటున్నామని రజనీకాంత్ అభిమానులు అంటున్నారు.

20 ఏళ్ల నుంచి ఎదురు చూపు !

20 ఏళ్ల నుంచి ఎదురు చూపు !

దేవుడు ఆదేశిస్తే తప్పకుండా ? అంటూ గత 20 ఏళ్ల నుంచి రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై వాయిదా వేస్తూ వస్తున్నారు. రజనీకాంత్ దాటవేత ధోరణిపై అనేక రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేసిన సందర్బాలు ఉన్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా ? అనే విషయంలో స్పష్టతలేకుండా పోయింది.

తమిళనాట నేడు నెలకొన్న !

తమిళనాట నేడు నెలకొన్న !

ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తలైవా తన అభిమానులతో భేటీ కావడం తమిళనాడుతో సహ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందుకు అద్దంపట్టే విధంగా రజనీకాంత్ ప్రసంగాలు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించాయి.

రాజకీయాల్లోకి వచ్చినట్లే !

రాజకీయాల్లోకి వచ్చినట్లే !

రజనీకాంత్ మాటలు వింటే ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని సంకేతాలు వెలువడ్డాయి. యుద్దానికి సిద్దం కండి అంటూ అభిమానులకు సంకేతాలు ఇచ్చిన రజనీకాంత్ తమిళనాడు రాజకీయ నాయకులకు నిద్రలేకుండా చేశారు.

రాజకీయ అవతారం !

రాజకీయ అవతారం !

ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చెయ్యాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అదే స్థాయిలో రజనీకాంత్ ను వ్యతిరేకిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారనే చెప్పాలి. ఎవరు ఆహ్వానించినా, వ్యతిరేకించినా తలైవా మాటే మాకు వేదం అంటున్నారు ఆయన అభిమానులు.

 అక్కడే బీజం పడింది !

అక్కడే బీజం పడింది !

కరూర్ లో ఆరు వందలకు పైగా రజనీకాంత్ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వార్డుల వారీగా అభిమాన సంఘాల సంఖ్య 1,600కు పైగా చేరాయి. తమిళనాడులోని అన్ని జిల్లాలో వార్డులు, మారుమూల గ్రామాల స్థాయిలో సంఘాల ఏర్పాటు మీద దృష్టి పెడుతున్నారు.

మా బలం మాది, అందుకే ప్రయత్నాలు !

మా బలం మాది, అందుకే ప్రయత్నాలు !

రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటించినా, రాజకీయ ప్రవేశం చేసినా తమ బలం తమది అని చాటుకోవాల్సిన వసరం ఉందని, అందుకే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టామని కరూర్ లోని రజనీకాంత్ అభిమాన సంఘాలు అంటున్నాయి.

అవునా, మాకు తెలీదే !

అవునా, మాకు తెలీదే !

వార్డుల స్థాయిలో సంఘాలు ఏర్పాటు చెయ్యాలని తాము ఎవ్వరికి ఆదేశాలు ఇవ్వలేదని, అభిమాన సంఘాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారని మాకు తెలీదని చెన్నైలోని రజనీకాంత్ అభిమాన సంఘాల కార్యాలయం ప్రతినిధిలు అంటున్నారు. మొత్తం మీద తమిళనాడులో రజనీకాంత్ అభిమానులు రాజకీయంగా ఎదగడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు.

English summary
Recently, during a meeting with fans, Rajinikanth dropped hints about taking political plunge. He asked them 'be ready for war' and expressed regret over rotten political system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X