పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష... చట్టం తీసుకురానున్న ఇండోనేసియా

పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొంటే ఏడాదిపాటు జైలు శిక్ష విధించే విధంగా ఇండోనేసియా చట్టం తీసుకొస్తోంది.

ఈ నెలలో బిల్లును ఆమోదిస్తారని భావిస్తున్నారు.

వచ్చే వారంలో అది చట్టంగా మారొచ్చని బిల్లు రూపకల్పనలో భాగస్వామి అయిన ఇండోనేసియా రాజకీయనేత తెలిపారు.

ఆ బిల్లు చట్టంగా మారిన తరువాత ఇండోనేసియా పౌరులతో పాటు అక్కడి విదేశీయులకు కూడా శిక్షలు వేస్తారని వెల్లడించారు.

బిల్లు ప్రకారం పెళ్లి కాకుండానే సెక్స్‌లో పాల్గొన్నారని ఫిర్యాదు అందితేనే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. పెళ్లి అయిన వారి విషయంలో భర్త లేదా భార్య ఫిర్యాదు చేయొచ్చు.

తమ భాగస్వామి ఇతరులతో సెక్స్‌లో పాల్గొంటున్నారని భావిస్తే భర్త లేదా భార్య ఫిర్యాదు ఇవ్వవచ్చు. పెళ్లి కాని వారి విషయంలో అయితే తమ పిల్లలు సెక్స్ పాల్గొంటున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

పెళ్లి కాకుండా కలిసి జీవించడాన్ని అంటే సహజీవనాన్ని కూడా ఈ బిల్లు నిషేధిస్తోంది. దోషులుగా తేలితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.

మంచం పడుకొని ఉన్న దంపతులు

అయితే, ఈ కొత్త బిల్లు వల్ల ఇండోనేసియా పేరు దెబ్బతినే అవకాశం ఉందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. పర్యాటకం తగ్గడంతోపాటు పెట్టుబడుల రాక దెబ్బతింటుందని వారు ఆందోళనవ్యక్తం చేశారు.

'ఇలాంటి సంప్రదాయ చట్టాలు తీసుకురావడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి. దాంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు’ అని ఇండోనేసియా ఎంప్లాయర్స్ అసోసియేషన్ అంటోంది.

గతంలోనే తీసుకొచ్చిన ఇలాంటి బిల్లు 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ నాడు దేశవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకత వచ్చింది. వేల మంది వీధుల్లో నిరసనకు దిగారు.

ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఎంతో మంది విద్యార్థులు నిరసనకు దిగడం, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. నిరసనకారుల మీద టియర్ గ్యాస్, జలఫిరంగులు ఉపయోగించారు.

ముస్లింలు మెజారిటీగా ఉండే ఇండోనేసియాలో సెక్స్ మీద ఆంక్షలు కొత్తేమీ కాదు. అచెహ్ ప్రావిన్స్ ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తోంది. గ్యాంబ్లింగ్, మందు తాగడం, అపోజిట్ సెక్స్ వారిని కలవడం వంటి కేసుల్లో శిక్షలు కూడా విధించింది.

2021లో జరిగిన ఒక కేసులో సెక్స్‌లో పాల్గొన్నందుకు ఇద్దరు మగవారిని చుట్టుపక్కల వారు వెలివేశారు. బహిరంగంగా వారిని పోలీసులు కొరడా దెబ్బలు కొట్టారు.

అదే రోజున ఒక మహిళ, ఒక పురుషుడు చాలా దగ్గర ఉన్నందుకు 20 కొరడా దెబ్బల శిక్షను విధించారు. మద్యం తాగినందుకు ఇద్దరు మగవారిని 40 కొరడా దెబ్బలు కొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+