వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో, రూ.1.7 కోట్ల వేతనంతో ఐఐటీ విద్యార్థికి గూగుల్ ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఇటీవలి కాలంలో ఐఐటీ విద్యార్థులను భారీ వేతనంతో వివిధ కంపెనీలు తమ సంస్థలలో ఉద్యోగాన్ని ఇస్తున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొద్ది రోజులుగా పలువురు విద్యార్థులు కోట్లాది రూపాయల వార్షిక వేతనంతో గూగుల్ వంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ విద్యార్థికి కూడా భారీ వేతనంతో గూగుల్ ఉద్యోగం ఆఫర్ చేసింది.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఇండోర్‌లో ఫైలియర్ చదువుతున్న గౌరవ్ అగర్వాల్‌కు గూగుల్ రూ.1.7 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గౌరవ్ అగర్వాల్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్‌కి చెందిన విద్యార్థి. ఐఐటీ-ఇండోర్ విద్యార్థికి గత మూడేళ్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ.

గూగుల్ సంస్థ ఆన్ లైన్ పరీక్ష పెడుతుందని చెప్పారని, దానికి తాను హాజరయ్యానని, అనంతరం షార్ట్ లిస్ట్ తీసి తనను గుర్గావ్‌కు ఇంటర్వ్యూకి పిలిచారని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. తదుపరి ఇంటర్వ్యూలు బెంగళూరులో జరిగాయని అతను చెప్పారు.

IIT-Indore student gets Rs 1.7 crore job offer from Google

ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, ఆల్గారిథంకు చెందిన ప్రశ్నలు వారు అడిగారని చెప్పారు. అనంతరం తనకు వారు ఆఫర్ లెటర్ పంపించారని తెలిపారు. అమెరికాలో సాఫ్టువేర్ ఇంజినీరుగా పని చేయాలని తనకు ఆఫర్ లెటర్ వచ్చిందని ఆయన తెలిపారు. గౌరవ్ అగర్వాల్ ఎప్పుడు ఉద్యోగంలో చేరేది త్వరలో తెలియనుంది.

కాగా, గౌరవ్ అగర్వాల్ 2011లో ఐఐటీ-ఇండోర్‌లో జాయిన్ అయ్యారు. అతను పదో తరగతి, పన్నెండో తరగతిలో 90 శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్నారు. ఇటీవల అతను వరల్డ్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియార్డ్ ఫైనల్స్ తదితరాల్లో పాల్గొన్నారు.

English summary
Breaking the myth that established IITs fare better in job placements, a final-year computer science graduate of Indian Institute of Technology (IIT)-Indore bagged a job with Google at an annual package of Rs 1.7 crore per annum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X