రూ.1.5 కోట్లు: ఐఐటీ కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ కళ్లు చెదిరే ఆఫర్
ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ.1.5కోట్లను వార్షిక వేతనంగా చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది.
లక్నో: ఐఐటీ కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ.1.5కోట్లను వార్షిక వేతనంగా చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది.
ఐఐటీ కాన్పూర్ చరిత్రలో ఓ విద్యార్థి ఇంత మొత్తంలో వార్షిక వేతనంగా అందుకోవడం ఇదే మొదటిసారి. గత ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థి రూ.93లక్షలు వార్షిక వేతనంగా అందుకున్నాడు.

అయితే, ఈ ఏడాది 200 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఓలా, ఉబెర్, పేటీఎం, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సేవలందించే సంస్థలు కూడా ఉన్నాయి.
ఈసారి మొత్తం ఎనిమిది మందికి మంచి ఆఫర్లు వచ్చినట్లు ఐఐటీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 18వ తేదీ వరకు జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూలలో 2,100 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దేశీయ ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్లేస్‌మెంట్ ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications