ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటన
లక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా రోడ్డు మీద తనకు భార్యతో ఏ సంబంధం లేదని తేల్చిచెప్పి వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మధురాలో ఈ ఘటన జరిగింది.
ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం భర్తలపై ఉక్కుపాదం మోపే చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజముద్ర కూడా వేశారు. ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే యూపీలో ఓ భర్త తలాక్ చెప్పాడు.

మధురాకు చెందిన జమిరాత్ అనే మహిళను మేవాత్‌కు చెందిన ఇక్రమ్ పెళ్లిచేసుకున్నాడు. అయితే వీరికి పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం ఇస్తామని హామీనిచ్చారు. అయితే కట్నం ఇవ్వలేదు. దీంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. కట్నం ఇచ్చేందుకు జమిరాత్ ఫ్యామిలీ నిరాకరించింది. దీంతో ఇక్రమ్ ఆగ్రహానికి గురయ్యాడు. పంచాయతీ పెద్దల ముందే రోడ్డుపైనే జమిరాత్‌కు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications