Illegal affair: బెడ్ రూమ్ లో నిద్రపోతున్న భర్త, అర్దరాత్రి భార్య ?, కొట్టి చంపేసి ఆసుపత్రిలో డ్రామాలు, బెండ్ !
చెన్నై/ టీ నగర్: ఒకే సిటీలో ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం ప్రేమికులు ఎంజాయ్ చేశారు. ప్రేమికుల పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు పెళ్లి చేసుకుని కాపురం ఉంటున్నారు. భర్త ఉదయం బయటకు వెళితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు ఇంట్లోనే ఉంటున్న భార్య మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. భార్య మొబైల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడుతోంది, ఏం మాట్లాడుతోంది అంటూ మొబైల్ లో సెట్టింగ్స్ చేసి రికార్డు చేస్తున్న భర్త తరువాత వాటిని సీక్రేట్ గా వింటున్నాడు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. ఇక ముందు నువ్వు ఎవ్వరితో కూడా ఇలాంటి బూతు మాటలు మాట్లాడకూడదని భర్త అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా భార్య బూతుపురాణం ఆగలేదని సమాచారం. ఉదయం భార్యను పిలుచుకుని ఆసుపత్రికి వెళ్లిన భర్త ఆమె ఇంట్లో జారికిందపడిపోవడంతో తలకు పెద్ద గాయం అయ్యిందని వైద్యులకు చెప్పాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

ఒకే ఏరియాలో లవర్స్
చెన్నైలోని కన్నగి నగర్ ఏరియాలో పుగల్ కోడి అలియాస్ ఢిల్లీ బాబు (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కన్నగి నగర్ ఏరియాలోనే నివాసం ఉంటున్న సరిత (20) అనే యువతి, ఢిల్లీ బాబు ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి సరిత, ఢిల్లీ బాబు సంతోషంగా కలిసితిరిగారు.

ఇంటి నుంచి పారిపోయి లవ్ మ్యారేజ్
ప్రేమికులు సరిత, ఢిల్లీ బాబుల పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు సరిత, ఢిల్లీ బాబు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. భార్య సరితను పోషించడానికి ఢిల్లీ బాబు ఆటో నడుపుతున్నాడు. ఉదయం ఆటో తీసుకుని బయటకు వెలుతున్న ఢిల్లీ బాబు రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు.

భార్య మీద డౌట్ వచ్చేసింది
పగలు ఇంట్లోనే ఉంటున్న ఢిల్లీ బాబు భార్య సరిత మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, సోషల్ మీడియాలో కాలం గడపడం చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరిత మీద ఆమె భర్త ఢిల్లీ బాబుకు అనుమానం పెరిగిపోయింది. నా భార్య సరిత నిత్యం మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోందని, నాకు మోసం చేసి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని ఢిల్లీ బాబు అనుమానం పెంచుకున్నాడు.

భార్య మొబైల్ ఫోన్ లో సెట్టింగ్స్.... సీక్రేట్ గా ?
భార్య సరిత మొబైల్ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడుతోంది, ఏం మాట్లాడుతోంది అంటూ మొబైల్ లో సెట్టింగ్స్ చేసి రికార్డు చేస్తున్న ఢిల్లీ బాబు అర్దరాత్రి ఆమె నిద్రపోయిన తరువాత రికార్డింగ్ కాల్స్ లో ఆ మాటలు సీక్రేట్ గా వింటున్నాడు. భార్య సరిత వేరే వ్యక్తితో బూతులు మాట్లాడుతున్న విషయం తెలుసుకుని ఢిల్లీ బాబు షాక్ అయ్యాడు.

బూతులు మాట్లాడకూడదని వార్నింగ్
ఇదే విషయంలో సరిత, ఢిల్లీ బాబు దంపతుల మద్య గొడవలు జరిగాయి. ఇక ముందు నువ్వు ఎవ్వరితో కూడా ఫోన్ లో ఇలాంటి బూతు మాటలు మాట్లాడకూడదని ఢిల్లీ బాబు అతని భార్య సరితకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా భార్య సరిత బూతుపురాణం ఆగలేదని తెలుసుకున్న ఆమె భర్త ఢిల్లీ బాబు రగిలిపోయాడు.

రాత్రి కర్రతో చితకబాదేశాడు
ఏప్రిల్ 18వ తేదీ రాత్రి ఢి్లీ బాబు ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య సరితో భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి సరిత మొబైల్ ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతోందని ఢిల్లీ బాబు గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే సరిత సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఆ సమయంలో రగిలిపోయిన ఢిల్లీ బాబు మొదట చేతితో సరితను చితకబాదేశాడు. తరువాత కోపం తట్టుకోలేక పెద్ద కర్ర తీసుకుని సరితాను చితకబాదేశాడు.

హడలిపోయిన మొగుడు
తలకు తీవ్రగాయాలు కావడంతో సరిత బెడ్ మీద అలాగే పడిపోయింది. సరిత నిద్రపోయిందని అనుకున్న ఢిల్లీ బాబు మరుసటి రోజు ఉదయం సరితను నిద్రలేపాడు. సరిత నిద్రలేవకపోవడంతో ఆందోళన చెందిన ఢిల్లీ బాబు ఆమెను చెన్నైలోని ఆర్ జీజీజీహెచ్ ఆసుపత్రికి తరలించి అక్క డ్రామాలు ఆడాడు.

దెబ్బకు మ్యాటర్ లీక్
సరిత ఆసుపత్రికి వెళ్లిన ఆమె భర్త ఢిల్లీ బాబు నా భార్య ఇంట్లో జారికిందపడిపోవడంతో తలకు పెద్ద గాయం అయ్యిందని వైద్యులకు చెప్పాడు. చికిత్స పొందుతూ సరిత చనిపోయింది. వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఢిల్లీ బాబును అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నా భార్య సరిత అక్రమ సంబంధం పెట్టుకుందని తానే కొట్టి చంపేశానని ఢిల్లీ బాబు అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications