Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియురాలిని లేపేశాడు, నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్, ఏం జరిగిందంటే ?

చెన్నై/ భువనేశ్వర్: వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న మహిళ కూతురు పుట్టిన తరువాత ఆమె స్నేహితుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. భర్తలేని సమయంలో ప్రియుడితో కలిసి ఆమె చాలా కాలం ఎంజాయ్ చేసింది. అయితే ఎక్కడో ప్రియుడికి, ప్రియురాలికి తేడా కొట్టింది. మాజీ ప్రియురాలి మీద కక్ష పెంచుకున్న యువకుడు ఆమె మీద పగ తీర్చుకోవాలని టైమ్ కోసం ఎదురు చూశాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ప్రియురాలు, ఆమె కూతురిని చంపేయాలని స్కెచ్ వేశాడు. టైమ్ బాగాలేక ప్రియుడి చేతిలో ఆమె ప్రియురాలు దారుణ హత్యకు గురి కావడంతో ఆమె కూతురు బతికిపోయింది. నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్ చేసి చెప్పిన ప్రియుడు విషం తాగి చేతి నరాలు కత్తిరించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

 సంతోషంగా భర్తతో కాపురం చేస్తున్న భార్య

సంతోషంగా భర్తతో కాపురం చేస్తున్న భార్య

ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి జాజ్ పూర్ కు చెందిన ప్రియాంక ప్రియదర్శిని సాహూ అనే యువతిని నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు రాకేష్, ప్రియాంకకు మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. రాకేష్, ప్రియాంక దంపతులు భువనేశ్వర్ లోని భీమాతంగి ఏరియాలో అద్దె ఇంటిలో కాపురం ఉంటున్నారు.

 మాజీ ప్రియుడు

మాజీ ప్రియుడు

జాజ్ పూర్ కు చెందిన ప్రియాంక ప్రియదర్శిని సాహు, అదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ ప్రధాన్ స్నేహితులు. పెళ్లికి ముందే ప్రియాంక, జగన్నాథ్ చనువుగా ఉండేవారని తెలిసింది. తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా ప్రియాంక ఇంట్లో పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకుని రాకేష్ తో కాపురం చేస్తోంది. ప్రస్తుతం ప్రియాంకకు జగన్నాథ్ మాజీ ప్రియుడు.

 భర్త లేని సమయంలో ప్రియుడితో భార్య ఎంజాయ్

భర్త లేని సమయంలో ప్రియుడితో భార్య ఎంజాయ్

భువనేశ్వరన్ లో ప్రియాంక భర్త రాకేష్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురితో కలిసి ప్రియాంక ఇంట్లోనే ఉంటోంది. భర్త రాకేష్ లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ప్రియాంకతో ఎంజాయ్ చెయ్యడానికి జగన్నాథ్ వెళ్లివచ్చేవాడు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కూడా జగన్నాథ్ అతని ప్రియురాలు ప్రియాంక ఇంటికి వెళ్లేవాడని సమాచారం. చాలా కాలంమంగా మాజీ ప్రియుడు రాకేష్ తో ప్రియాంక అక్రమ సంబంధం సాగిస్తోందని సమాచారం.

 భర్త ఉద్యోగానికి...... ఇంట్లోకి ప్రియుడి ఎంట్రీ

భర్త ఉద్యోగానికి...... ఇంట్లోకి ప్రియుడి ఎంట్రీ

ఉదయం 9 గంటల సమయంలో భర్త రాకేష్ ఇంట్లో టిఫిన్ చేసుకుని ఉద్యోగానికి వెళ్లిపోయాడు. తరువాత ప్రియాంక కూతురు ఆడుకోవడానికి ఇంటి ఓనర్ ఇంటిలోకి వెళ్లింది. ప్రియాంక మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంది. ఉదయం 11 గంటల సమయంలో జగన్నాథ్ ఆమె ప్రియురాలు ప్రియాంక ఇంటిలోకి వెళ్లాడు. చాలాసేపు ప్రియాంక, జగన్నాథ్ ఇంట్లో కలిసి ఉన్నారు.

 పక్కాస్కెచ్ తో చంపేశాడు

పక్కాస్కెచ్ తో చంపేశాడు

ఇంట్లో ప్రియాంక, జగన్నాథ్ మద్య ఎందుకు గొడవ జరిగిందో ? ఏమో తెలీదు కాని జగన్నాథ్ సహనం కోల్పోయాడు. జగన్నాథ్ కత్తి తీసుకుని ప్రియాంకను దారుణంగా పొడిచి చంపేశాడు. ప్రియురాలు ప్రియాంక ప్రాణం పోయిందని జగన్నాథ్ నిర్దారించుకున్నాడు. తరువాత జగన్నాథ్ విషం తాగిసి చేతి మణికట్టు కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

 నీ భార్యను చంపేశాను..... వచ్చి చూసుకో

నీ భార్యను చంపేశాను..... వచ్చి చూసుకో

ప్రియాంకును హత్య చేసిన తరువాత జగన్నాథ్ ఆమె భర్తకు ఫోన్ చేసి నీ భర్తను చంపేశాను వచ్చి చూసుకో అని చెప్పాడు. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడంతో షాక్ కు గురైన రాకేష్ వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటి యజమాని చుట్టుపక్కలవాళ్లు వెళ్లి చూడగా ప్రియంక ఇంటి లోపల తలుపు లాక్ చేసి ఉంది. వెంటనే తలుపులు పగలగొట్టి చూడగా ప్రియాంక, ఆమె ప్రియుడు జగన్నాథ్ రక్తపు మడుగులో పడి ఉన్న విషయం గుర్తించి పోలీసులు రాకేష్ కు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
     ఇద్దరిని చంపేయాలని అనుకున్నా

    ఇద్దరిని చంపేయాలని అనుకున్నా

    ప్రియాంక ప్రాణం పోయిందని తెలుసుకున్న పోలీసులు జగన్నాథ్ ను ఆసుపత్రికి తరలించారు. జగన్నాథ్ ఆసుపత్రిలో కొలుకుంటున్నాడని పోలీసులు అన్నారు. ప్రియాంకను, ఆమె కూతునిని ఇద్దరిని చంపేయాలని తాను అనుకున్నానని జగన్నాథ్ అంటున్నాడని పోలీసులు అన్నారు. జాజ్ పూర్ ప్రాంతానికే చెందిన ప్రియాంకకు, జగన్నాథ్ కు చాలా సంవత్సరాల నుంచి సంబంధం ఉందని, అతను పూర్తిగా కొలుకున్న తరువాత అను ఎందుకు చంపి ఆత్మహత్యాయత్నం చేశాడో అనే విషయం తెలుస్తోందని భువనేశ్వర్ పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+