Illegal affair: భర్తను చంపేసి శవం మాయం చేసిన భార్య, కిలాడి, ఏం చేసిందంటే!

బెంగళూరు/మంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న భార్య పక్కదారి పట్టింది. భర్తతో కాపురం చేస్తూనే వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది. భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెను పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు. భర్త ఊర్లో పెద్దలు, భార్య ఊర్లో పెద్దలు పంచాయితీలు, రాజీలు చేసి విసిగిపోయారు. ఇదే సమయంలో భార్య, ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యులు కలిసి భర్తను హత్య చేసి శవాన్ని మాయం చెయ్యడం కలకలం రేపింది.

హ్యాపీలైఫ్ లో ట్రబుల్

హ్యాపీలైఫ్ లో ట్రబుల్

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపుర తాలుకా, అత్తగార్ గ్రామంలో రాజేష్ నారాయణ్ నాయక్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు చూపించిన శ్వేత నాయక్ (29) అనే యువతితో రాజేష్ వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలం తరువాత రాజేష్ జీవితంలో సమస్యలు మొదలైనాయి.

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య

భర్త రాజేష్ తో కాపురం చేస్తున్న అతని భార్య శ్వేత ఆమె సొంత ఊరికి చెందిన రాకేష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునింది. వివాహం కాకముందు నుంచి శ్వేతాకు రాకేష్ తో అక్రమ సంబంధం ఉందని సమాచారం. భర్త బయటకు వెళ్లిన తరువాత శ్వేతా ప్రియుడు రాకేష్ ఆమె ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేసి వెలుతున్నాడని సమాచారం.

బెండ్ తీసిన భర్త...... డోంట్ కేర్ అని చెప్పిన భార్య

బెండ్ తీసిన భర్త...... డోంట్ కేర్ అని చెప్పిన భార్య

కొన్ని నెలల క్రితం శ్వేతా, రాకేష్ అక్రమ సంబంధం గురించి ఆమె భర్త రాజేష్ కు తెలిసిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని రాజేష్ అతని భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. భార్య శ్వేతా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రాజేష్ ఆమెను చితకబాదుతూ బెండ్ ఎత్తేశాడు. భర్త ఎంత కొట్టినా శ్వేతా మాత్రం ఆమె బుద్ది మార్చుకోకుండా ప్రియుడు రాకేష్ తో మరింత ఎక్కువగా తిరగడం మొదలు పెట్టింది.

పంచాయితీలు చేసి విసిగిపోయిన పెద్దలు

పంచాయితీలు చేసి విసిగిపోయిన పెద్దలు

ఇంతకు ముందు అనేకసార్లు భర్త రాజేష్ మీద అతని భార్య శ్వేతా గొడవ పడింది. రాజేష్ ఊర్లోని పెద్దలు పంచాయితీలు చేశారు. శ్వేతా ఊర్లోని పెద్దలు పంచాయితీలు చేసినా భార్య భర్తలు మాత్రం గొడవ పడుతూనే ఉన్నారు. శ్వేతాకు ఆమె కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు ఇవ్వడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. భర్త ఊర్లో పెద్దలు, భార్య ఊర్లో పెద్దలు పంచాయితీలు, రాజీలు చేసిచేసి విసిగిపోయి మీ చావు మీరు చావండి అంటూ శ్వేతా, రాజేష్ దంపతులను వదిలేశారు.

ఇంట్లో గొడవ.....మాయం అయిపోయిన భర్త

ఇంట్లో గొడవ.....మాయం అయిపోయిన భర్త

జూన్ 10వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో శ్వేతా ఇంటికి ఆమె తల్లిదండ్రులు దీపక్ మరాఠి (53), యమునా (50), సోదరుడు గంగాధర (26) వెళ్లారు. ఆ సమయంలో శ్వేతా, ఆమె కుటుంబ సభ్యులు అందరూ రాజేష్ తో పెద్దగా గొడవపడ్డారు. రాజేష్ ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం స్థానికులు గమనించారు. తరువాత భర్త రాజేష్ ఆచూకి తెలీకుండాపోయింది.

భర్తను చంపేసిన భార్య, ఆమె ఫ్యామిలీ?

భర్తను చంపేసిన భార్య, ఆమె ఫ్యామిలీ?

నాలుగు రోజులు అయినా రాజేష్ ఆచూకి లేకపోవడంతో అతని అక్క దీపా నాయక్ యల్లాపుర పోలీసులను ఆశ్రయించింది. తన తమ్ముడు రాజేష్ భార్య శ్వేతా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతన్ని చంపేసిందని జూన్ 14వ తేదీ కేసు పెట్టింది. శ్వేతా, ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యులు కలిసి రాజేష్ ను హత్య చేసి శవం మాయం చేశారని దీపా ఆరోపిస్తోంది.

కచ్చితంగా చెప్పలేము

కచ్చితంగా చెప్పలేము

కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్ కోసం గాలించినా ఎలాంటి ఫలితం లేదు. నెల రోజులు అవుతున్నా రాజేష్ ఆచూకి చిక్కపకపోవడంతో పోలీసులు రాజేష్ భార్య శ్వేతా, ఆమె కుటుంబ సభ్యలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఎంతగా విచారణ చేసిన శ్వేతా తన భర్త రాజేష్ గురించి తనకు తెలీదని చెబుతోందని పోలీసులు అంటున్నారు.

శ్వేతాకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఊరిలోని కొందరు చెప్పారని, రాజేష్ శవం చిక్కకపోవడంతో అతను హత్యకు గురైనాడని మేము కచ్చితంగా చెప్పలేమని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+