Illegal affair: పోలీసు పెళ్లాం లవ్ స్టోరీ, మొగుడిని మట్టిలో కలిపేసింది, రూ. లక్షలు డీల్ !
ముంబాయి/ చెన్నై: పెళ్లాం పోలీసు, మొగుడు ఆటో డ్రైవర్. కొంతకాలం పోలీసు పెళ్లాంతో డ్రైవర్ మొగుడు చక్కగానే కాపురం చేశాడు. ఒకే పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్ తో పోలీసు పెళ్లాం లింక్ పెట్టుకునింది. పోలీసు పోలీసు రాసుకోవడంతో బెడ్ రూమ్ లో మొగుడికి పాండ్స్ పౌడప్ వాసన వచ్చేసింది. తన పెళ్లాం పాండ్స్ పౌడర్ సాటి పోలీసులు నాకేస్తున్నాడని తెలుసుకున్న భర్త రగిలిపోయి పోలీసు పెళ్లాన్ని చితకబాదేశాడు. నా రేంజ్ ఏంది ?, నాకు ఆటో మొగుడు ఏంది ? అంటూ పొలీసు పెళ్లాం రెచ్చిపోయింది. మొగుడిని చంపించడానికి కిలాడీ పోలీసులు సాటి పోలీసు ప్రియుడికి లక్షల రూపాయలు కిరాయి ఇచ్చి మొగుడిని మట్టిలో కలిపేయాలి అని అనుకున్న పని పూర్తి చేసేసింది. అయితే అక్కడే గ్రహాలు మొత్తం అడ్డం తిరగడంతో సీన్ తిరగబడిపోయింది.

పోలీసు పెళ్లాం.... డ్రైవర్ మొగుడు
మహారాష్ట్ర పాల్ఘర్ ప్రాంతంలో స్నేహల్ పాటిల్ లేడీ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. స్నేహల్ పాటిల్ పుండలీక్ (35) అనే వ్యక్తిని వివాహం చేసుకునింది. స్నేహల్ పాటిల్ భర్త పుండలీక్ పాటిల్ ఆటో డ్రైవర్. వివాహం అయిన తరువాత స్నేహల్ కు కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ఆటో డ్రైవర్ మొగుడితో కొన్ని సంవత్సరాల పాటు స్నేహల్ పాటిల్ చక్కగానే కాపురం చేసింది.

పక్కలోనే ప్రియుడు
మహారాష్ట్రలోని వాసై పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో స్నేహల్ పాటిల్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నది. స్నేహల్ పాటిల్ తోటి పోలీసు వికాస్ పాస్తే తో చనువు పెంచుకునింది. ఉద్యోగం నెపంతో అక్కడక్కడ వికాస్ తో తిరుగుతున్న స్నేహల్ పాటిల్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ఇక పోలీస్ స్టేషన్ లో, బయట వికాస్, స్నేహల్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

మొగుడికి పెళ్లాం పాండ్స్ పౌడర్ వాసన వచ్చేసింది
పోలీసు- పోలీసు రాసుకుంటే పాండ్స్ పౌడర్ వాసన వచ్చినట్లు స్నేహల్ పాటిల్, వికాస్ అక్రమ సంబంధం అక్కడ ఇక్కడ తెలిసి చివరికి భర్త పుండలీక్ కు తెలిసిపోయింది. వికాస్ తో తన భార్య స్నేహల్ చాలా సన్నిహితంగా, ఏకాతంగా ఉండగాచూసి అసలు విషయం తెలుసుకున్న భర్త పుండలీక్ నీ పద్దతి బాగలేదని భార్య స్నేహల్ కు పదేపదే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాడు.

మొగుడి హత్యకు పెళ్లాం రూ. లక్షలు డీల్
తన భర్త పుండలీక్ ను చంపేస్తే పోలీసు ఉద్యోగాలు చేస్తున్న మనం కేసు నుంచి సులభంగా తప్పించుకోవచ్చని స్నేహల్ పాటిల్ ప్రియుడు వికాస్ కు చెప్పింది. భర్త పుండలీక్ ను చంపేసిన వాళ్లకు రూ. 2.50 లక్షలు ఇస్తానని స్నేహల్ పాటిల్ ప్రియుడు వికాస్ తో డీల్ మాట్లాడింది. అనుకున్నట్లుగానే ప్రియుడు వికాస్ చేతిలో రూ. 2. 50 లక్షలు పెట్టింది.

పోలీస్ లవర్స్ స్కెచ్ మామూలుగా లేదు
ప్రియురాలు స్నేహల్ ఇచ్చిన డబ్బుతో ప్రియుడు వికాస్ మరో ముగ్గురిని కిరాయికి మాట్లాడుకుని పక్కాగా పుండలీక్ ను హత్య చెయ్యడానికి స్కెచ్ వేశాడు. స్నేహల్ పాటిల్
భర్త హత్య జరిగిన రోజు ఆ ముగ్గురు హంతకులు పుండలీక్ పాటిల్ ఆటోలోనే ప్రయాణించారు. పుండలీక్ ను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన తరువాత ఐరన్ రాడ్ లు, ఇతర మారణాయుధాలతో అతనిపై దాడి చేసి స్పాట్ లో చంపేశారు.

ఏదో అనుకుంటే.... ఏదో జరిగింది
స్నేహల్ తన ప్రియుడు వికాస్, ఇంకో ముగ్గురితో కలిసి భర్త పుండలీక్ ను చంపించింది. ఆటోరిక్షా డ్రైవర్ అయిన పుండలీక్ పాటిల్ మృతదేహం మనోర్ లోని దేఖ్ లే అనే పల్లెటూరి వద్ద విసిరేశారు.
పోస్టుమార్టంలో పుండలీక్ తల పై బరువైన ఆయుధాలతో కొట్టడం వల్లనే అనేక గాయాలై అతను చనిపోయాడు అని పోలీసుల దర్యాప్తులో విస్తు
పోయే నిజాలు బయటపడ్డాయి.

స్కెచ్ పూర్తిగా రివర్స్
ఆటో డ్రైవర్ పుండలీక్ ఆటో ఆక్సిడెంట్ లో మరణించినట్లు వీళ్లు చిత్రీకరించారు. ఆటోను వేరే వాహనం ఢీకొట్టినట్లు, అందులో ఉన్న ఆటో డ్రైవర్ పుండలీక్ ప్రాణాలు పోయినట్లు చిత్రీకరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆటో నుజ్జునుజ్జు అయినా పోస్టుమార్టుం రిపోర్టులో పుండలీక్ తలకు బలమైన గాయాలు అయినట్లు వెలుగు చూడటంతో అందరూ అడ్డంగా దొరికిపోయారు.

ఏం సాధించింది ఈ పెళ్లాం ?
పోలీసు ప్రియుడి మోజులో కట్టుకున్న భర్త పుండలీక్ ను రూ. 2. 50 లక్షలు ఇచ్చి దారుణంగా హత్య చేయించిన స్నేహల్ పాటిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. భర్త హత్య కేసులో అరెస్టు అయిన స్నేహల్ పాటిల్ ఉద్యోగం ఊడిపోయి ఆమె జైలుపాలైయ్యింది. ప్రియురాలు మోజులో సాటి పోలీసు వికాస్ అరెస్టు కావడంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగాలు ఊడిపోయిన వికాస్, కిలాడీ లేడీ స్నేహల్ జైల్లో చిప్పకూడు తినడానికి సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications