Illegal affair: ప్రియుడితో పాటు భార్యను చంపేసిన ఆంటీ, కొత్త లవర్ తో స్కెచ్, కోట్ట ఆస్తి కోసం!
లక్నో: వివాహం చేసుకున్న వ్యాపారి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వివాహం జరిగి 30 ఏళ్లు అవుతున్నా వ్యాపారి దంపతులకు పిల్లలు పుట్టలేదు. వ్యాపారికి సొంత ఇంటితో పాటు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఇదే సమయంలో వ్యాపారికి ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో అతను పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త అక్రమ సంబంధం విషయం తెలిసినా అతని భార్య పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. వ్యాపారం చేస్తున్న దంపతులు ఒక్కసారిగా కనపడకుండా పోయారు. వ్యాపారి, అతని భార్య మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి.
వ్యాపారి భార్య సోదరుడికి అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టాడు. వ్యాపారి, అతని భార్య కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. వ్యాపారి, అతని భార్య మొబైల్ ఫోన్ నెంబర్లకు ఎవరెవరు ఫోన్లు చేశారు ? అని ఆరా తీశారు. ఇదే సమయంలో వ్యాపారి అక్రమ సంబంధం విషయం బయటపడింది. వ్యాపారి అతని భార్య బ్యూటీపార్లల్ షాపులో పని చేస్తున్న మహిళతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు. వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది.
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడితో పాటు ఆయన భార్యను కూడా చంపేసి ఇద్దరి శవాలను ఆమె సొంత ఇంటి వెనుక పాతిపెట్టేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. వ్యాపారాలు చేస్తున్న ప్రియుడికి వారసులు ఎవ్వరూ లేరని, కోట్ల రూపాయల ఆస్తి కొట్టేయాలని ప్రియురాలు ఆమె కొత్త ప్రియుడు, కొడుకుతో కలిసి వ్యాపారి, అతని భార్యను చంపేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

వ్యాపారం చేస్తున్నాడు
ఉత్తరప్రదేశ్ లోని ఆలీఘర్ లోని కృష్ణ కాలనీలో రాజేష్ అగర్వాల్ అలియాస్ అగర్వాల్ (55) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. 30 ఏళ్ల క్రితం రాజేస్ అగర్వాల్ అబిత అనే మహిళవివాహం చేసుకున్నాడు. వ్యాపారం చేస్తున్న రాజేష్ అగర్వాల్ అతని భార్య బబితతో సంతోషంగా కాపురం చేశాడు. వివాహం జరిగి 30 ఏళ్లు అవుతున్నా వ్యాపారి రాజేష్ అగర్వాల్, బబిత దంపతులకు పిల్లలు పుట్టలేదు.

వ్యాపారికి అక్రమ సంబంధం
వ్యాపారి రాజేష్ అగర్వాల్ కు సొంత ఇంటితో పాటు కొన్ని వ్యాపారాలు, మూడు సొంతంగా షాపులు ఉన్నాయి. ఇదే సమయంలో వ్యాపారి రాజేష్ అగర్వాల్ వివాహిత మహిళ దేవి (39)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వ్యాపారి రాజేష్ అగర్వాల్ అతని ప్రియురాలు దేవితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త రాజేష్ అగర్వాల్ అక్రమ సంబంధం విషయం తెలిసినా అతని భార్య బబిత పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది.

వ్యాపారి దంపతులు మాయం
వ్యాపారం చేస్తున్న రాజేష్ అగర్వాల్, అతని భార్య ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఒక్కసారిగా కనపడకుండా పోయారు. వ్యాపారి రాజేష్ అగర్వాల్, అతని భార్య బబిత మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. వ్యాపారి రాజేష్ అగర్వాల్ భార్య బబిత సోదరుడు, ఘాజియాబాద్ లో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ రాణా కు అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టాడు.

దేవీ మేడమ్ మ్యాటర్ లీక్
వ్యాపారి రాజేష్ అగర్వాల్, అతని భార్య బబిత కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. వ్యాపారి, అతని భార్య కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. వ్యాపారి రాజేష్ అగర్వాల్, అతని భార్య బబిత మొబైల్ ఫోన్ నెంబర్లకు ఎవరెవరు ఫోన్లు చేశారు ? అని ఆరా తీశారు. ఇదే సమయంలో వ్యాపారి రాజేష్ అగర్వాల్, దేవీల అక్రమ సంబంధం విషయం బయటపడింది.

భార్య బ్యూటీపార్లల్లో పని చేస్తున్న కిలాడీ లేడీ
వ్యాపారి రాజేష్ అగర్వాల్ అతని భార్య బబిత సొంత బ్యూటీపార్లల్ షాపులో పని చేస్తున్న దేవీ అనే మహిళతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు. వ్యాపారి రాజేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న దేవీకి మహిళకు ముఖేష్ సింగ్ అనే మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఆస్తి కోసం ఇద్దరినీ చంపేశారు
పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. దేవికి తుషార్ సింగ్ (19) అనే కొడుకు ఉన్నాడు. తన పాత ప్రియుడు రాజేష్ అగర్వాల్, అతని భార్య బబితను చంపేస్తా ఆస్తి మొత్తం తనకే వస్తుందని దేవీ స్కెచ్ వేసింది. వ్యాపారి రాజేష్ అగర్వాల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న దేవి ప్రియుడితో పాటు ఆయన భార్య బబితను కూడా చంపేసింది.

ఇంటి వెనుకే శవాలు పూడ్చేసిన కిలాడీ లేడీ
రాజేష్ అగర్వాల్, బబితను చంపేసి వారి ఇద్దరి శవాలను ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న హమీద్ పూర్ లోని దేవీ ఇంటికి తీసుకెళ్లారని, అక్కడే దేవీ సొంత ఇంటి వెనుక రెండు శవాలు పాతిపెట్టేశారని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.

ఆంటీ టీమ్ మొత్తం అరెస్టు
రాజేష్ అగర్వాల్, అతని భార్య బబితను హత్య చెయ్యడానికి దేవీకి ఆమె కొడుకు తుషార్ సింగ్, దేవీ ప్రియుడు ముఖేష్ సింగ్, ప్రియుడు సోదరుడు ధీరజ్ సింగ్ సహకరించారని విచారణలో వెలుగు చూసిందని బిజ్నోర్ జిల్లా ఎస్పీ ధరమ్ వీర్ సింగ్ మీడియాకు చెప్పారు. వ్యాపారాలు చేస్తున్న ప్రియుడు రాజేష్ అగర్వాల్ ఆస్తులకు వారసులు ఎవ్వరూ లేరని, కోట్ల రూపాయల ఆస్తి కొట్టేయాలని అతని ప్రియురాలు దేవి ఆమె కొత్త ప్రియుడు ముఖేష్ సింగ్, కొడుకు తుషార్ సింగ్ తో కలిసి వ్యాపారి, అతని భార్యను చంపేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications