Illegal affair: విదేశాల్లో భర్త, బెడ్ రూమ్ లో బావ, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ?, బావిలో భర్త శవం !
చెన్నై/ సేలం: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ వివాహం చేసుకుంది. భార్యతో కొంతకాలం కాపురం చేసిన భర్త విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సరంలో రెండు నెలలు సొంత ఊరికి వస్తున్న భర్త అతని భార్యతో సంతోషంగా ఉంటున్నాడు. సెలవులు పూర్తి అయిన తరువాత భర్త విదేశాలకు వెళ్లిపోతున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో అతని భార్య ఆమె అక్క భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె బావతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. బంధువులు, స్నేహితులు విదేశాల్లో ఉన్న భర్తకు నీ భార్య ఆమె బావతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని సమాచారం ఇచ్చారు. నా భార్యను నమ్మి నేను విదేశాలకు వచ్చి డబ్బు సంపాధించి పంపిస్తుంటే నా భార్య ఆమె బావతో ఎంజాయ్ చేస్తూ ఇంత నీచానికి దిగజారిందా ?
అంటూ భర్త రగిలిపోయాడు. కంపెనీలో రెండు నెలలు సెలవు తీసుకున్న భర్త విదేశాల నుంచి బయలుదేరి తమిళనాడు వచ్చాడు. నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లిన భార్య ప్రియుడు అతని ప్రియురాలి భర్తను కారులో పికప్ చేసుకుని బయలుదేరాడు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లకుండా బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ మద్యం సేవించారు. తరువాత భర్త అతని భార్య ఇంటికి వెళ్లి అతని భార్యను నిలదీశాడు. మీ బావ అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎందుకు తిరుగుతున్నావని, మా మార్యాద పూర్తిగా తీసేశావని గొడవకు దిగాడు. బావతో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య అతని ముఖం మీద రాళ్లతో దాడి చేసి ముఖం గుర్తు పట్టకుండా చేసి శవాన్ని తీసుకెళ్లి బావిలో విసిరేయడం కలకలం రేపింది. విదేశాల నుంచి భర్త వచ్చాడని అత్తారింటికి సమాచారం ఇవ్వకుండా భార్య సైలెంట్ గా ఉండిపోయింది. విదేశాల్లో ఉన్న కొడుకు భారత్ కు వచ్చి ఫోన్ కూడా చెయ్యకపోవడం, ఇంటికి కూడా రాకపోవడంతో అతని తల్లిదండ్రులు, సోదరుడికి అనుమానం రావడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త
తమిళనాడులోని సేలంకు చెందిన వెంకటేష్ దక్షిణ ఆఫ్రికాలోని డీప్ వెల్ నిర్మాణ సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్ ను సేలం జిల్లాలోని మిట్టపుత్తూరు లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అనే మహిళ వివాహం చేసుకుంది. భార్య విజయలక్ష్మితో కొంతకాలం కాపురం చేసిన ఆమె భర్త వెంకటేష్ దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.

సెలవుల్లో మాత్రమే భర్తతో ?
సంవత్సరంలో రెండు నెలలు సొంత ఊరికి వస్తున్న వెంకటేష్ అతని భార్య విజయలక్ష్మితో సంతోషంగా ఉంటున్నాడు. సెలవులు పూర్తి అయిన తరువాత విజయలక్ష్మి భర్త వెంకటేష్ విదేశాలకు వెళ్లిపోతున్నాడు. వివాహం జరిగిన తరువాత విజయలక్ష్మి ఆమె భర్త వెంకటేష్ తో చక్కగానే కాపురం చేసింది.

అక్క మొగుడితో ఎంజాయ్ చేసింది
భర్త వెంకటేష్ విదేశాల్లో ఉండటంతో అతని భార్య విజయలక్ష్మి ఆమె అక్క సరస్వతి భర్త కుమరన్ అలియాస్ కుమార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. విదేశాల్లో ఉన్న భర్ వెంకటేష్ కు ఏమాత్రం మ్యాటర్ లీక్ కుండా జాగ్రత్త పడిన విజయలక్ష్మి అక్క సరస్వతి మొగుడిని పూర్తిగా వలలో వేసుకుని అతనికి స్వర్గం చూపించింది.

భర్తకు సమాచారం ఇచ్చిన బంధువులు, ఫ్రెండ్స్
రెండు సంవత్సరాల నుంచి విజయలక్ష్మి, కుమారన్ అక్రమ సంబంధం విషయం ఏమాత్రం బయటకు రాలేదు. తరువాత భర్త వెంకటేష్ బంధువులకు విజయలక్ష్మి, కుమారన్ అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. బంధువులు, స్నేహితులు విదేశాల్లో ఉన్న వెంకటేష్ కు నీ భార్య విజయలక్ష్మి ఆమె బావ కుమారన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని సమాచారం ఇచ్చారు.

కోయంబత్తూరు వచ్చిన భర్త
నా భార్య విజయలక్ష్మిని నమ్మి నేను దక్షిణ ఆఫ్రికా వచ్చి డబ్బు సంపాధించి పంపిస్తుంటే నా భార్య ఆమె బావ కుమారన్ తో ఎంజాయ్ చేస్తూ ఇంత నీచానికి దిగజారిందా ? అంటూ వెంకటేష్ రగిలిపోయాడు. కంపెనీలో రెండు నెలలు సెలవు తీసుకున్న వెంకటేష్ దక్షిణా ఆఫ్రికా నుంచి బయలుదేరి తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు.

ప్రియురాలి భర్తకు మందు పార్టీ ఇచ్చిన ప్రియుడు
నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లిన విజయలక్ష్మి ప్రియుడు కుమారన్ అతని ప్రియురాలి భర్త వెంకటేష్ ను కారులో పికప్ చేసుకుని బయలుదేరాడు. కోయంత్తూరు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయలక్ష్మి ఇంటికి వెళ్లకుండా బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లిన వెంకటేష్, కుమారన్ మద్యం సేవించారు. తరువాత వెంకటేష్ అతని భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్లి భార్యను నిలదీశాడు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
మీ బావ కుమారన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎందుకు తిరుగుతున్నావని, మా మార్యాద పూర్తిగా తీసేశావని, పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని వెంకటేష్ అతని భార్య విజయలక్ష్మితో గొడవకు దిగాడు. ఆ సమయంలో విజయలక్ష్మి, వెంకటేష్ దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న విజయలక్ష్మి బావ, ప్రియుడు కుమారన్ ఇనుపరాడ్ తీసుకుని ప్రియురాలి భర్త వెంకటేష్ తల మీద దాడి చేసి దారుణంగా చంపేశారు.

శవం బావిలో విసిరేసి సైలెంట్ గా ఉండిపోయిన భార్య
విజయలక్ష్మి, ఆమె ప్రియుడు కుమారన్ కలిసి వెంకటేష్ ముఖం మీద రాళ్లతో దాడి చేసి ముఖం గుర్తు పట్టకుండా చేసి శవాన్ని తీసుకెళ్లి మిట్టపుత్తూరు సమీపంలోని పాడుపడిన బావిలో విసిరేశారు. విదేశాల నుంచి వెంకటేష్ ఇంటికి వచ్చాడని అత్తారింటికి సమాచారం ఇవ్వకుండా విజయలక్ష్మి ఏమీ తెలీనట్లు సైలెంట్ గా ఉండిపోయింది.

లొంగిపోయిన భార్య, ప్రియుడు
విదేశాల్లో ఉన్న కొడుకు వెంకటేష్ తమిళనాడు వచ్చి ఫోన్ కూడా చెయ్యకపోవడం, ఇంటికి కూడా రాకపోవడంతో అతని తల్లిదండ్రులు, సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే విజయలక్ష్మి, ఆమె ప్రియుడు కుమారన్ (బావ) నేరుగా సేలం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయి వెంకటేష్ ను హత్య చేశామని చెప్పారు.

బావిలో శవం కుళ్లిపోయింది
పోలీసులు విజయలక్ష్మిని వెంట పిలుచుకుని వెళ్లి పాడుబడిన బావిలో నుంచి కుళ్లిపోయిన వెంకటేష్ శవం బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. అక్రమ సంబంధం కారణంగా బావ కుమారన్ తో కలిసి విజయలక్ష్మి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చెయ్యడం సేలంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications