వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరుములు, ట్రాఫిక్ జామ్.. ఢిల్లీలో వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీ

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) ఢిల్లీలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలియజేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. 32 నుంచి 25 సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది.

వర్ష ప్రభావం వల్ల గురువారం, శనివారం, ఆదివారం కూడా ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ రోజుల్లో ఎల్లో అలర్ట్.. శుక్రవారం గ్రీన్ అలర్ట్ అని తెలిపింది. దీని వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని తెలిపింది. గ్రీన్ అంటే ఓకే.. యెల్లో అంటే బ్యాడ్ వెదర్ అని చెబుతోన్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ అంటే మరింత బ్యాడ్ వెదర్ అని అర్థం. ఇక రెడ్ అంటే రవాణా, కరెంట్ సరఫరా కూడా కష్టం అనే సంగతి తెలిసిందే.

 IMD issues warning for bad weather in Delhi today

మంగళవారం రోజున ట్రాఫిక్ అంతరాయం కలిగిన సిచుయేషన్ చూశాం. రోహ్ తక్ రోడ్‌లో చాలా ట్రాఫిక్ జామ్ జరిగింది. ముంద్ కా అండర్ పాస్‌లో వర్షపునీరు నిలిచిపోయి ఉంది. మధ్య ఢిల్లీలో ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. సప్దార్ జంగ్‌లో 3.6 వర్షపాతం కురిసింది. లోడి రోడ్, రిడ్జ్ ఏరియా, నోయిడా, పీతంపురలో 1 మిల్లీ మీటర్, 17.6, మి.మీ. 2 మి.మీ. 7 మి.మీ చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది.

English summary
Delhi witnessed a warm Tuesday with some parts of the national capital witnessing rain in the latter part of the day, the meteorological department has issued an "orange" alert for Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X