• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారెవ్వా క్యాబాత్ హై: మోడీ ఫ్యాన్స్‌కు ప్రియాంకా షేక్‌ హ్యాండ్..వీడియో వైరల్

|

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ప్రచారంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీజేపీని తన ప్రసంగాలతో చీల్చి చెండాడుతున్న ప్రియాంకాగాంధీ అదే బీజేపీ కార్యకర్తలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది.

మోడీ మద్దతుదారులకు ప్రియాంకా గాంధీ షేక్ హ్యాండ్

మోడీ మద్దతుదారులకు ప్రియాంకా గాంధీ షేక్ హ్యాండ్

ప్రచారంలో భాగంగా తన కాన్వాయ్‌లో ప్రియాంకా గాంధీ వెళుతున్నారు. ఇండోర్ విమానాశ్రయం నుంచి ఆమె తన కాన్వాయ్‌లో వెళుతుండగా రోడ్డు పక్కన మోడీ మద్దతు దారులు మోడీ మోడీ అంటూ నినదించారు. ఇది గమనించిన ప్రియాంకా గాంధీ ఆమె కాన్వాయ్‌ను పక్కకు ఆపారు. వెంటనే తన టాటా సఫారీ ఎస్‌యూవీ వాహనం నుంచి బయటకు దిగారు. నేరుగా బీజేపీ మద్దతుదారుల దగ్గరకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. ఆమె వాహనం దిగి ఆ యువకుల వైపు నడుస్తున్న సమయంలో ఆమెను ఎస్‌పీజీ సెక్యూరిటీ ఫాలో అయ్యింది.

మోడీ సపోర్టర్స్‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పిన ప్రియాంకా

ప్రియాంకా మోడీ మద్దతు దారులకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కరచాలనం చేసిన ప్రియాంకా వారితో ముచ్చటించారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు.. నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను ఆల్‌ ది బెస్ట్ అని చెప్పి చిరునవ్వుతో ఆమె వాహనంలో వెళ్లిపోయారు. ఈ వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్టు చేసింది. నెటిజెన్ల నుంచి మంచి కామెంట్లు వచ్చాయి.

 ప్రియాంకా ఫోటోలు తీసుకున్న మోడీ ఫ్యాన్స్

ప్రియాంకా ఫోటోలు తీసుకున్న మోడీ ఫ్యాన్స్

ప్రియాంకా గాంధీ వారి దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇస్తుందని తాము ఊహించలేదని చెప్పారు బీజేపీ కార్యకర్తలు. అంతేకాదు వారు ప్రియాంకాకు ఆల్‌ ది బెస్ట్ అని కూడా విష్ చేయగా మరో కార్యకర్త ప్రియాంకా గాంధీ ఫోటోలు తీసుకున్నాడు. ఇక వారికి గుడ్ బై చెప్పిన జూనియర్ ఇందిరమ్మ రాజ్ మొహల్లాలో జరిగే రోడ్‌షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆసమయంలో ప్రియాంకా గాంధీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్‌లు ఉన్నారు. అంతకుముందు కూడా ప్రియాంకా గాంధీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు. రత్లం లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ప్రియాంకా... ఫెన్సింగ్‌ల పైకి ఎక్కి దిగి అటువైపున ఉన్న కార్యకర్తల దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చారు.

మొత్తానికి తన ప్రసంగాలతో మోడీ పాలనపై విరుచుకుపడుతున్న ప్రియాంకా గాంధీ ఒక్కసారిగా వాహనం దిగి మోడీ సపోర్టర్స్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడంపై చాలామంది అభినందిస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు చూసేందుకు చాలా బాగా అనిపిస్తాయని చెబుతున్నారు. ప్రియాంకాలో తన నానమ్మ ఇందిరా తెగింపు కనిపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంకా మంచి భవిష్యత్తుఉన్న నేతగా ఎదుగుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

English summary
Congress leader Priyanka Gandhi once again crossed the protocol. Ms Gandhi while going in her convoy stopped and greeted Modi supporters and wished them all the best. The supporters were left with surprise and wished her in return.The video of Priyanka Gandhi went viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X