మోడీ చేతుల మీదగా 'జంషెడ్ జీ టాటా' స్మారక నాణేలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ వ్వవస్ధాపకుడు జంషెడ్ జీ టాటా 175వ పుట్టిన రోజుని పురస్కరించుకుని స్మారక నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో రూ. 5, రూ. 100 విలువైన నాణేలను ఆవిష్కరిస్తారని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఇప్పటి వరకు కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, సంస్ధలకు ఈ అరుదైన గౌరవాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారిగా ఓ పారిశ్రామికవేత్తకు అందించడం టాటాతోనే మొదలవుతుంది. 1958, 1965 సంవత్సరాల్లో జంషెడ్ జీ టాటా పేరు మీద ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది.

గుజరాత్‌లోని బరోడా దగ్గర్లోని నవ్‌సారి అనే చిన్న పట్టణంలో 1839 మార్చి మూడవ తేదీన జన్మించారు జంషెడ్ జీ టాటా. తండ్రి నుసెర్వాంజీ టాటా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తుండేవాడు. టాటా వంశీకులు పార్శీ మతానికీ చెందినవారు.
ఎనిమిదవ శతాబ్దంలో వారు భారతదేశానికి వలసవచ్చి వ్యాపారం చేసుకుంటూ భారతీయ సంస్కృతికి అలవాటుపడిపోయి భారతీయులుగా స్థిరపడిపోయారు. ఆ రోజుల్లో వారికి ఇంటిపేరు ఉండేదికాదు. వారు చేసే వ్యాపారాలను బట్టి వారి ఇంటి పేరు ఉండేది. ఉదాహరణకు ఇంజనీర్ అనీ, డాక్టరు అని, బాటిల్ వాలా అని ఉండేది. ఆ ప్రకారంగానే జంషెడ్ జీ వంశీకులకు టాటా అనే పేరు వచ్చింది.












Click it and Unblock the Notifications