దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

గుజరాత్ ఎఫెక్ట్: పన్ను భారం తగ్గింపు, 28% స్లాబ్‌లో 50 వస్తువులే

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   GST CHANGE : Only 50 items to face 28% tax rate: Know all the details

   గౌహతి:గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై వరాల జల్లు కురిపించింది. జిఎస్టీ కౌన్నిల్ సమావేశంలో ఎక్కువ మొత్తంలో ఉపయోగించే వస్తువులపై పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు.రూ. 28 వేల కోట్లను వదులుకొనేందుకు కేంద్రం సిద్దమైంది. అదే సమయంలో 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులు మాత్రమే చేర్చారు.

   శుభవార్త: 200 వస్తువులపై పన్ను భారం తగ్గించే చాన్స్

   జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు గౌహతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నారు. జిఎస్టీ అమలైన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

   జీఎస్టీ ఎఫెక్ట్: దేశీయ మార్కెట్ దూకుడు, చివరి గంటలో

   అయితే ఆయా రాష్ట్రాల వినతుల మేరకు జిఎస్టీ కౌన్సిల్‌లో చర్చించారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిఎస్టీ ఎఫెక్ట్ ప్రభావం ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

    28 శాతం పన్ను పరిధిలో 50 వస్తువులే

   28 శాతం పన్ను పరిధిలో 50 వస్తువులే

   జీఎస్‌టీ 23వ కౌన్సిల్‌ సమావేశంలో జీఎస్‌టీ రేట్ల స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. గౌహతిలో శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో నిత్యావసరమైన పలు వస్తువులపై జీఎస్‌టీ ని తగ్గించింది. ఇప్పటి వరకు 227 వస్తువులపై 28శాతం పన్ను రేటు ఉంది.అయితే 28 శాతం పన్ను పరిధిలోకి కేవలం 50 వస్తువులను మాత్రమే చేర్చారు. ఇప్పటివరకు 28 శాతం పన్ను పరిధిలో ఉన్న 173 వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి మార్చారు.

    లగ్జరీ వస్తువులపై ఛార్జీలు

   లగ్జరీ వస్తువులపై ఛార్జీలు

   ప్రస్తుతం కేవలం 50 వస్తువులపై మాత్రమే 28శాతం పన్ను నిర్ణయించినట్టు బిహార్‌ ఆర్థికమంత్రి సుశీల్‌ మోడీ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువలపై మాత్రమే అధిక రేట్లను నిర్ణయించామని చెప్పారు. చూయింగ్‌ గమ్స్‌, చాకోలెట్స్‌, ఆఫ్టర్‌ షేవ్‌, వాషింగ్‌ పౌడర్‌‌లపై పన్నులు 18 శాతంగా నిర్ణయించింది. టెక్నాలజీ సంబంధిత అంశంపై వడ్డీరేటును నిర్ణయించేందుకు ఐదుగురు సభ్యుల మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న మోడీ అత్యధిక పన్నుల స్లాబ్‌ 28శాతం కేటగిరీ లో 173 వస్తువుల ధరలను తగ్గించేందుకు కౌన్సిల్ అంగీకరించినట్టు తెలిపారు. నాన్‌ ఎసీ రెస్టారెంట్లపై 18శాతం నుంచి జీఎస్‌టీ పన్నులు 12శాతానికి చేర్చింది.

    28వేల కోట్లు వదులుకొన్న కేంద్రం

   28వేల కోట్లు వదులుకొన్న కేంద్రం

   28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులను చేర్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.28 వేల కోట్లను నష్టపోతోందని అధికారులు ప్రకటించారు.వ్యాపారులు, తయారీదారులు వినియోగదారులకు అనుకూలంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని జిఎస్టీ కౌన్సిల్ సభ్యుడు సుశీల్ ‌కుమార్ మోడీ చెప్పారు.. ఇప్పటికే దాదాపు 200 వస్తువులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నామన్నారు.

   ధరలు తగ్గే వస్తువులివే

   ధరలు తగ్గే వస్తువులివే

   టూత్‌పేస్టులు, షేవింగ్ క్రీములు, ప్లాస్టిక్ వస్తువులు, హ్యాండ్ మేడ్ ఫర్నిచర్‌తో పాటు నిత్యావసరాలు, సామాన్యులు ఉపయోగించే అన్ని వస్తువులు ఇకపై మరింత చౌక అవుతాయి. సామాన్యులు వాడే వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించారు. దాదాపు 150 రకాల వస్తువుల ధరలు తగ్గుతాయి. పొగాకు, సిగరెట్లు వంటి విలాసవంతమైన వస్తువులు, సేవలను మాత్రమే 28 శాతం జీఎస్‌టీ పరిథిలో ఉంచినట్లు సుశీల్‌కుమార్ మోడీ చెప్పారు.

   English summary
   Only 50 of over 220 items will remain in the highest GST tax slab of 28 per cent, with the others moved to lower slabs, Bihar Finance Minister Sushil Modi said today in Assam's Guwahati, where Union Finance Minister Arun Jaitley is meeting his counterparts from states in the powerful GST council. The decision comes amid complaints by traders and small businesses which say the new nationwide tax, which came into effect from July, has increased their tax and administrative burden.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more