ది లీడర్ 2019: కలిసిన మోడీ వ్యతిరేకులు నితీష్-హార్దిక్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కలిశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కలిశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు.
2014 ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ ప్రధాని అవుదామనుకున్నారు. మోడీ పేరు బీజేపీ తెరపైకి తీసుకు రావడంతో ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మోడీకి నితీష్‌కు రాజకీయ వైరం ఉంది. ఇటీవల నోట్ల రద్దు అంశాన్ని నితీష్ ప్రశంసించారు. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నితీష్ సమర్థించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు, గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వానికి హార్దిక్ పటేల్ చుక్కలు చూపిస్తున్నారు. పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ముఖ్యంగా మోడీకి వ్యతిరేకులైన నితీష్, హార్దిక్ పటేల్‌లు కలవడం గమనార్హం.
బీహార్‌లో మద్య నిషేధం పైన హార్దిక్ పటేల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు.

హార్దిక్ పటేల్ మంగళవారం నాడు నితీష్ కుమార్‌ను కలిశారు. నితీష్ కుమార్‌లో 2019 నాయకుడిని హార్దిక్ పటేల్ చూస్తున్నారు.
వచ్చే నెలలో హార్దిక్ పటేల్ సౌరాష్ట్రలో ర్యాలీ నిర్వహించారు. దీనికి నితీష్‌ను ఆహ్వానించారు. ఆయన అందుకు అంగీకరించారు. హార్దిక్ పటేల్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలను కలిశారు. ఈ రెండు రాష్ట్రాలలోను సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హార్దిక్, నితీష్‌లు కలిసి వేదిక పంచుకోనున్నారు.
జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఈ విషయమై స్పందిస్తూ.. హార్దిక్ పటేల్ రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే నితీష్ - హార్దిక్ కలిసి వేదిక పంచుకుంటారన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను హార్దిక్ పటేల్ కలిసినప్పుడు రాజస్థాన్ గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షఅ సమితి అధికార ప్రతినిధి హిమ్మత్ సింగ్ ఉండటం గమనార్హం.
నితీష్ పైన హార్దిక్ ప్రశంసలు కురుపించారు. అంతేకాదు, నితీష్‌ను లీడర్ ఆప్ 2019గా పేర్కొన్నారు. అదే సమయంలో హార్దిక్ పోరాటాన్ని నితీష్ ప్రశంసించారు. రిజర్వేషన్ల పైన ముందుకెళ్లాలని, నీ వెంట మేం ఉన్నామని నితీష్.. హార్దిక్‌కు చెప్పారని జేడీయూ నేత త్యాగి అన్నారు.












Click it and Unblock the Notifications