రాహుల్ గాంధీ పార్లమెంట్ నాయకుడిగా ఉంటే బీజేపీకి పండగే ... అస్సాం ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కష్టాలమీద కష్టాలు వచ్చి చేరాయి. ఓవైపు పార్టీ పదవిపై సస్పన్స్ కొనసాగుతుంటే..మరోవైపు ఆయన నాయకత్వంపై రాష్ట్ర్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం వేలెత్తి చూపుతున్నారు. దీంతో రాహుల్ నాయకత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే రానున్న 50 సంవత్సరాలు బీజేపీకి పండగేనని అస్సాం ఎమ్మెల్యే హిమంతా బిష్వాస్ శర్మ ఎద్దేవా చేశారు.ఇక పార్లమెంట్‌లో చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడు కావాలని అయన స్పష్టం చేశారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆ స్థానంలో లేకుండా ఉంటే అలాంటీ నాయకుడు వస్తాడని ఆయన పేర్కోన్నాడు.
కాంగ్రెస్ పార్టీ సాధరణ ఎన్నికల్లో ఘొరా పరాజయంపాలు కావడంతో ఆపార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార భాద్యతలు నిర్వహించిన రాహుల్ గాంధీ సైతం తన స్వంత నియోజక వర్డంలో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలోకి నెట్టబడింది. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామ చేస్తానంటూ ప్రకటనలు చేశాడు. కాని దానిపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ససేమీర అంటుంది. దీంతో ఆయన పార్టీ నాయకత్వంతో చర్చలు మీద చర్చలు జరుపుతున్నారు

ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర్రాల్లో నాయకత్వం కూడ నైతిక భాద్యత వహిస్తూ రాజీనామ బాటపడుతున్నారు. దీంతో రాహుల్ గాంధీ రాజీనామ కూడ ఆ పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో రాహుల్‌ను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు మరో కొద్ది రోజులు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు సన్నద్దమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications