మోడీ బాటలో కాంగ్రెస్-గంటలు మోగించి, డ్రమ్స్ కొట్టాలని పిలుపు-ఎందుకో తెలుసా ?
ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విభిన్న మార్గాల్లో నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏకంగా మోడీ బాటలోనే వెళ్లి నిరసనలు చేయాలని నిర్ణయించింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి తెచ్చేందుకు వీలుగా నిరసనలకు పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా హద్దు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, పీసీసీ అధ్యక్షులు, ఇన్ ఛార్జ్ లు ఈ మేరకు మార్చి 31వ తేదీన పెట్రో ధరల మోతపై నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇందులో ప్రజల్ని కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు గంటలు మోగించి, డ్రమ్స్ కొట్టి నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నేత రణ్ దీప్ సూర్జేవాలా పిలుపునిచ్చారు.

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ కేంద్రంపై విరుచుకుపడింది. ప్రజలపై సిగ్గులేని దోపిడీని ఆపాలని పార్టీ నేతలు సూచించారు. ఇంధన ధరల పెంపుకు వ్యతిరేకంగా మార్చి 31న ఉదయం 11 గంటలకు గ్యాస్, పెట్రోలు ధరల అపరిమితమైన పెరుగుదలకు వ్యతిరేకంగా చెవిటి బిజెపి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ప్రజలు తమ ఇళ్ల వెలుపల, బహిరంగ ప్రదేశాల వెలుపల గ్యాస్ సిలిండర్లు, డప్పులు-బెల్లు, ఇతర వాయిద్యాలతో నిరసన తెలుపుతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు శనివారం లీటరుకు 80 పైసలు పెరిగాయి, చమురు సంస్థలు ముడి సరుకుల ధరలను వినియోగదారులకు బదిలీ చేయడంతో ఐదు రోజుల్లో నాలుగో పెరుగుదల నమోదైంది.












Click it and Unblock the Notifications