వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఢిల్లీలో యువతులపై రేప్‌ల్లో తండ్రీసోదరులు సహా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో 2014వ సంవత్సరం పది నెలల కాలంలో 1704 అత్యాచారానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. అందులో షాకింగ్ అంశాలు ఉన్నాయి. కూతురిని తండ్రి, సోదరిని అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు ఇలా పలువురు మహిళ పైన అత్యాచారం లేదా అత్యాచారయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

2014లో మొదటి పది నెలల కాలంలో 1704 కేసులు అత్యాచారానికి సంబంధించి నమోదయ్యాయి. అందులో 215 కేసులో సంబంధీకులే ముద్దాయిలుగా ఉన్నారు. ముఖ్యంగా 43 కేసులలో తండ్రులు, 27 కేసులలో సోదరులు అత్యాచార కేసులో ఉన్నారు. ఓ కేసులో బాధితురాలి గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. మరో 23 కేసులలో సవతి తండ్రులు ఉన్నారు.

Incest rapes on rise, fathers among offenders

ఎక్కువ కేసులలో నిందితులు బాధితులకు తెలిసిన వారే ఉన్నారు. మామలు, అల్లుళ్లు.. తదితరులు మూడు నుండి 74 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నాలుగు కేసులలో నిందితులు కజిన్స్ ఉన్నారు.

352 కేసులలో తమ ఇంటి సమీపంలోని వారు, 83 కేసులలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ రోల్ ఉంది. ట్యూటర్స్, ఇన్‌స్ట్రక్టర్స్ 24 కేసులలో ఉన్నారు. మరో ఐదు కేసులు మతపెద్దలు, తాంత్రికుల పైన నమోదయి ఉన్నాయి. 642 కేసుల్లో స్నేహితులు ఉన్నారు.

ఈ కేసులకు సంబంధించి 1613 మంది అరెస్టయ్యారు. ఇందులో 116 మంది నిరక్షరాస్యులు, 570 మంది డ్రాపౌట్స్, 122 మంది బాలనేరస్థులు, 23 మంది 50 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. 1711 మంది బాధితులు ఉన్నారు. ఇందులో నలుగురు బాధితులు రెండేళ్ల లోపు, 115 మంది 2-7 ఏళ్ల మధ్య, 127 మంది 7 - 12 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు.

English summary
Shocking figures submitted by the police to the Delhi high court have revealed that of the 1,704 cases of rape registered in the Capital in the first 10 months of this year, 215 were instances of incestuous rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X