ఐటీ అధికారుల ఆకస్మిక దాడులు, నోట్ల రద్దుపై మోడీకి హజారే ప్రశంస
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు రద్దు అనంతరం తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు... రద్దు చేయబడిన నోట్లకు బదులు బంగారం, ఇతర చలామణిలో ఉన్న నగదును ప్రయివేటుగా మార్పిడి చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు.
ఢిల్లీ, ముంబై, చండీగఢ్ తదితర నాలుగు ప్రధాన నగరాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రయివేటుగా నగదు మార్పిడి చేసే పలువురు బంగారు వర్తకులు, హవాలా డీలర్స్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు.
లూథియానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న ధనికులను లక్ష్యంగా చేసుకొని ఈ సోదాలు చేస్తున్నారు.
నల్లధనాన్ని కట్టడి చేసేందుకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ సంచలన ప్రకటన తర్వాత సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

మోడీ ప్రభుత్వానికి హజారే మెచ్చుకోలు
రూ.500, రూ.1000 నోట్లు రద్దు పైన అన్నాహజారే స్పందించారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పారు. నల్లధనంపై యుద్ధానికి ఇది మంచి స్టెప్ అని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదం, అవినీతిని అరికట్టేందుకు ఇది కొంత ఉపయోగపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications