ఐటీ దాడులు: శశికళ ఫ్యామిలీకి ముచ్చటగా మూడో రోజు షాక్, విదేశాల్లో భోగస్ కంపెనీలు !

శశికళ ఫ్యామిలీ, సన్నిహితులకు సంబంధించిన వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడో రోజూ శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

చెన్నై: శశికళ ఫ్యామిలీ, సన్నిహితులకు సంబంధించిన వారి ఇళ్లలో, కార్యాలయాల్లో మూడో రోజూ శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం నుంచి 187 ప్రాంతాల్లో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

శనివారం 120 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. శశికళ భర్త నటరాజన్, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్, ఆమె సోదరుడు దివాకరన్, టీటీవీ దినకరన్ సోదరుడు టీటీవీ భాస్కరన్, జయ టీవీ ఎండీ వివేక్, శశికళ మేనకోడలు కృష్ణప్రియ తదితర ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.

Recommended Video

    IT raids at Sasikala's Associates Continues | oneindia Telugu
    Income Tax raids on VK Sasikala clan continue for 3rd consecutive day

    శశికళ కుటుంబ సభ్యులను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు. అయితే ఓ అధికారి శశికళ కుటుంబ సభ్యులు రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని అన్నారు.

    ల్యాండ్ డీలింగ్, అక్రమంగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు, అక్రమ నగదు లావాదేవీలు చేశారని ఓ అధికారి చెప్పారు. శశికళ కుటుంబ సభ్యులు రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో వెలుగు చూసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+