వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర ప్రదేశ్: లఖింపూర్ ఖేరీ నిరసనల్లో ఇద్దరు రైతులు సహా ఐదుగురి మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లఖింపూర్ ఖేరీ నిరసనలు ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఇద్దరు రైతులు సహా ఐదుగురు మరణించారు.

లఖింపూర్ జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ అరవింద్ చౌరాసియా ఈ విషయాన్ని ధృవీకరించారని బీబీసీ ప్రతినిధి సమీరాత్మజ్ మిశ్రా పేర్కొన్నారు.

కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు నలిగిపోయారని, వాహనం బోల్తా పడడంతో మరో ముగ్గురు మరణించారని ఆయన చెప్పారు.

లఖింపూర్ ఖేరీ నిరసనలు ఉత్తర ప్రదేశ్

లఖింపూర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఆ తర్వాత ఆయన హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సమాచారం అందుకున్న రైతు నాయకులు డిప్యూటీ సీఎంకు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు.

ఈ సమయంలో, టికునియా పట్టణంలో బిజెపి మద్దతుదారుల వాహనం ఢీకొని కొందరు రైతులు గాయపడ్డారు.

ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు.

లఖింపూర్ ఖేరీ నిరసనలు ఉత్తర ప్రదేశ్

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మొహరించారు.

మరోవైపు, భారతీయ కిసాన్ యూనియన్ హోం శాఖ సహాయ మంత్రి కుమారుడి వాహనంతో ముగ్గురు రైతులను తొక్కించిందని ఆరోపించారు.

BKU నాయకుడు రాకేష్ టికాయత్ లఖింపూర్ బయలుదేరారు.

https://twitter.com/yadavakhilesh/status/1444617446011256834

https://twitter.com/priyankagandhi/status/1444643079424647171

https://twitter.com/RahulGandhi/status/1444636880029552644

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh: Five people, including two farmers, were killed in the Lakhimpur Kheri protests
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X