వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-ఉక్రెయిన్: మానవ హక్కుల విచారణ కమిషన్ ఏర్పాటుకు యూఎన్‌హెచ్ఆర్సీ ఓటింగ్, భారత్ దూరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశానికి అనేక అంశాల్లో ఎన్నో ఏళ్లుగా అండగా ఉంటూ వస్తున్న రష్యాకు వ్యతిరేకంగా వెళ్లడం లేదు భారత ప్రభుత్వం. అవసరమైన సమయాల్లో భారత్‌కు అండగా నిలవని అమెరికా, పలు అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉక్రెయిన్ దేశాలకు కూడా మద్దతు ఇవ్వడం లేదు. అయితే, రష్యా యుద్ధాన్ని వీడి చర్చలు జరపడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా? లేదా? అనే అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ ఉన్నత స్థాయి విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్ఆర్సీ) నిర్ణయించింది. ఇందుకోసం శుక్రవారం ఓటింగ్ నిర్వహించగా.. భారత్ దీనికి కూడా దూరంగా ఉంది.

India abstains in UNHRC vote on formation of panel to probe Russia-Ukraine war.

ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్రపై ఓ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం నిర్ణయిందని యూఎన్ హెచ్ఆర్సీ తెలిపింది. దీనిపై శుక్రవారం సమావేశమైన కౌన్సిల్.. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితులపై దర్యాప్తు చేపట్టేందుకు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింద.ి 47 సభ్యులున్న కౌన్సిల్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 32 దేశాలు ఓటేశాయి. వీటిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, నేపాల్, యూఏఈ వంటి దేశాలున్నాయి. రష్యా, ఎరిట్రియా వ్యతిరేకించాయి. ఇక భారత్, చైనా, పాకిస్థాన్ సహా 13 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

కాగా, రష్యా దండయాత్రపై ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటికి కూడా భారత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ గతవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై కూడా భారత్ దూరంగానే ఉంది. సర్వప్రతినిధి సభలో తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు ఓటేయగా, ఐదు దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా మరో 35 దేశాలు ఓటింగ్‌కూ దూరంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్‌కు రష్యా ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు, భారత్ వైఖరిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆంక్షలు విధించే యోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

English summary
India abstains in UNHRC vote on formation of panel to probe Russia-Ukraine war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X