భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి.. పాక్ కలుగులో దాక్కోవాలని తేల్చేశారుగా!

ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ భారత్ పై ప్రతి దాడికి ప్రయత్నం చేసింది. అయితే పాకిస్తాన్ భారత్ పై చేసిన దుస్సాహసాన్ని భారత భద్రత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. డ్రోన్ లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారికి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.

భారత్ కు పాకిస్తాన్ మొత్తం పైన దాడి చేసే సామర్థ్యం: ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ
ఈ క్రమంలో తాజాగా భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తం పైన దాడి చేసే సామర్థ్యం ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్ట్నెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా పేర్కొన్నారు. అదే గనుక జరిగితే పాకిస్తాన్ ఏదైనా కలుగులో దాక్కోవాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పాకిస్తాన్ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు.

India can attack on whole pakistan army air defence DG key comments

పాకిస్తాన్ మొత్తం మన నిఘా పరిధిలోనే
పాకిస్తాన్ మొత్తం తమ నిఘా పరిధిలోని ఉందని ఒకవేళ పాకిస్తాన్ తమ సైనిక ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండి నుండి ఖైబర్ పఖ్తున్ఖ్వా లాంటి ప్రాంతాలకు తరలించిన వారు దాక్కోడానికి చాలా లోతైన గొయ్యి తవ్వుకోవాల్సిందేనని ఆయన అన్నారు. పాకిస్తాన్లో ఏ మూలనైనా ఎంత లోతు కైనా వెళ్లి లక్ష్యాలను ఛేదించగల సత్తా, అందుకు కావలసిన ఆయుధ సంపత్తి భారతదేశానికి ఉన్నాయని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ పై కీలక విషయాలు వెల్లడి
పాకిస్తాన్లోని ప్రతి ప్రదేశం మన రేంజ్ లోనే ఉందని పేర్కొన్న ఆయన మన సరిహద్దుల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల పైన దాడి చేయగలమని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ గురించి కీలక విషయాలు తెలిపిన ఆయన భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లోని కీలక వైమానిక స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విలువైన టార్గెట్లను నాశనం చేయడానికి లోయిటరింగ్ మ్యూనిషన్స్ ను వాడినట్లు పేర్కొన్నారు.

దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాల కీలకపాత్ర
మన దేశీయ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లను, గైడెడ్ మ్యూనిషన్ లను ఈ ఆపరేషన్లో వినియోగించారని అవి కీలక పాత్ర పోషించినట్టు గా ఆయన తెలిపారు . మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడమే సైన్యంగా కర్తవ్యమని పేర్కొన్న ఆయన సరిహద్దులలో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యం అని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ తో తెలుసుకోవాల్సింది ఇదే
ఈరోజు ఆపరేషన్ సింధూర్ తో సాధించిన విజయంతో సైనికులు మాత్రమే కాదు, సైనిక కుటుంబాలు చివరికి భారత దేశ ప్రజలందరూ గర్వపడ్డారు. ఇదే ఈ ఆపరేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అటువంటి ముఖ్యమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు .శిశుపాల సిద్ధాంతం తరహాలో ఒక పరిమితి వరకు ఓపిక పట్టి, శత్రువు రెచ్చగొట్టే చర్యలు హద్దు దాటితే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటారని ఈ ఆపరేషన్ సిందూర్ తెలియజేసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+