వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు కరుగుతోంది.. మళ్లీ భారత్-చైనా మిలిటరీ చర్చలు-తూర్పు లడఖ్ లోనే

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మరో ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల సైనికాధికారుల మధ్య 16 రౌండ్ల చర్చలు జరిగాయి. ఈ కోవలోనే తాజాగా తూర్పు లడఖ్ లో మరోసారి ఇరుదేశాల కమాండర్లు చర్చించారు. అయితే ఈ చర్చల వివరాలను మాత్రం ఇరుదేశాలు రహస్యంగా ఉంచుతున్నాయి.

భారత్ -చైనా సీనియర్ సైనిక అధికారులు నిన్న తూర్పు లడఖ్‌లో చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడంపై వీరు దృష్టి సారించారు. మేజర్ జనరల్ స్థాయిలో ఇది రొటీన్ డైలాగ్ అని, ఇలాంటి చర్చలు నెలవారీ ప్రాతిపదికన జరుగుతాయని చర్చల గురించి మిలటరీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలోని పలు ఘర్షణ పాయింట్ల వద్ద ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో మరోసారి చర్చలు జరిగాయన్నారు.
అయితే చర్చలపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

India-China military officials talks in eastern Ladakh amid tensions

భారత, చైనా సైన్యాలు రెండేళ్లకు పైగా ఘర్షణ పాయింట్ల వద్ద ప్రతిష్టంభనలో నిమగ్నమై ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి శాంతి, ప్రశాంతత కీలకమని భారతదేశం వాదిస్తోంది. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి రెండు మిలిటరీలు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు 16 రౌండ్లు నిర్వహించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల పరంపర ఫలితంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున, గోగ్రా ప్రాంతంలో గత ఏడాది ఇరుపక్షాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశాయి.

English summary
miliatary commanders of india and china have hold talks in eastern ladakh yesterday on border issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X