వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో మళ్ళీ భారీగా; తాజాగా 32 వేలకు చేరువగా కరోనా కొత్త కేసులు, ఆ రాష్ట్రంతోనే టెన్షన్ !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి. భారతదేశం గత 24 గంటల్లో 31,923 కొత్త కేసులను నమోదు చేసింది. దీంతో భారతదేశపు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,63,421 కి చేరుకుంది. గత 24 గంటల్లో 282 మంది కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,46,050 కి చేరుకుంది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, చెల్లించే బాధ్యత రాష్ట్రాలదే : సుప్రీంకు కేంద్రం, గైడ్ లైన్స్ ఇవే !కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, చెల్లించే బాధ్యత రాష్ట్రాలదే : సుప్రీంకు కేంద్రం, గైడ్ లైన్స్ ఇవే !

 కరోనా యాక్టివ్ కేసులు, రికవరీల లెక్క ఇదే1

కరోనా యాక్టివ్ కేసులు, రికవరీల లెక్క ఇదే1


కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొత్త కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,01, 640 కి చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మందికి కరోనా సోకగా, అందులో 3.28 కోట్లమంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే దేశంలో 31 వేల మంది కరోనా నుండి బయటపడ్డారు. ఇక దేశంలో క్రియాశీల కేసుల రేటు 0. 90 శాతం ఉండగా, రికవరీ రేటు 97.77 శాతం గా ఉంది.

కేరళ లో కేసుల పెరుగుదలతో తీవ్ర ఆందోళన, మహారాష్ట్రలో తాజా పరిస్థితి ఇదే

కేరళ లో కేసుల పెరుగుదలతో తీవ్ర ఆందోళన, మహారాష్ట్రలో తాజా పరిస్థితి ఇదే

ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 19,675 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 142 మరణాలు సంభవించాయి. రోజువారీ కేసులలో కేరళ రాష్ట్రం దేశంలో సగానికిపైగా కరోనా కేసులను నమోదు చేస్తుండడం గమనార్హం. దేశంలో అత్యంత తీవ్రంగా కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3608 మంది కరోనా మహమ్మారి బారిన పడగా 48 మరణాలు సంభవించాయి.

తమిళనాడు, ఏపీ, కర్ణాటకలలో కొత్త కేసుల లెక్క ఇదే

తమిళనాడు, ఏపీ, కర్ణాటకలలో కొత్త కేసుల లెక్క ఇదే

ఆ తర్వాత అత్యంత ప్రభావితమైన రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం ఉంది . తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1682 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 21 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1365 కరోనా కేసులు నమోదు కాగా, 8 మరణాలు సంభవించాయి. ఇక ఐదవ స్థానంలో మిజోరం రాష్ట్రం నిలిచింది. మిజోరంలో గత 24 గంటల్లో 1,355 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3మంది కరోనా కారణంగా మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో 847 మంది కరోనా మహమ్మారి బారిన పడగా, 20 మంది మహమ్మారికి బలైపోయారు.

 గత 24 గంటల్లో ఒక్క మరణాన్ని కూడా నమోదు చెయ్యని రాష్ట్రాలివే

గత 24 గంటల్లో ఒక్క మరణాన్ని కూడా నమోదు చెయ్యని రాష్ట్రాలివే


దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 30 కరోనా కేసులు నమోదు కాగా జీరో మరణాలను నమోదు చేసింది. ఢిల్లీ మాత్రమే కాకుండా చత్తీస్ గడ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్ , ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, గోవా, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు సున్నా మరణాలను నమోదు చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించిన కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల లోగా నేరుగా నగదు బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Recommended Video

సోమవారం గన్ పార్క్ లో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ కు రేవంత్ సవాల్!
 దేశవ్యాప్తంగా 83.39 కోట్ల మేర వ్యాక్సిన్లు పంపిణీ

దేశవ్యాప్తంగా 83.39 కోట్ల మేర వ్యాక్సిన్లు పంపిణీ

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా, 83 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటివరకూ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 71.38 లక్షల మంది వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 83.39 కోట్ల మేర వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే భారత దేశంలో కరోనా కొత్త కేసులు 18 శాతం మేర పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

English summary
India has registered 31,923 new cases in the last 24 hours. This brings the total number to 3,35,63,421. 282 people have died in the last 24 hours. This brings the total death toll to 4,46,050. Tension gripped the country with Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X