125 ఏళ్ల తర్వాత మంటపుట్టించిన అక్టోబర్-నవంబర్ లోనూ భగభగలే-తాజా అంచనా..!

పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో భారత్ (India) పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఈ ఏడాది వర్షాకాలం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. అంతే కాదు వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ఎండలు చూస్తే 125 ఏళ్ల కాలంలో కేవలం మూడోసారి మాత్రమే అత్యంత వేడి నెలగా ఈ అక్టోబర్ నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే అక్టోబర్ నెల భారత్ పై ఎంత ప్రభావం చూపిందో అర్దమవుతోంది.

AP Rains: బలపడుతున్న వాయుగుండం- ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు..!
AP Rains: బలపడుతున్న వాయుగుండం- ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు..!

బలమైన ఎల్ నినో ప్రభావం కారణంగా అక్టోబర్ నెలలో పగటి సగటు ఉష్ణోగ్రతలు కాస్తా దదాపు 32.4 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. తద్వారా అక్టోబర్ నెలలో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాయి. ఇది సాధారణంతో పోలిస్తే 1.06 డిగ్రీల సెల్సియల్ అధికమని, 1901 తర్వాత చూస్తే ఇదే అత్యధికం అని రికార్డులు చెప్తున్నాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 1951, 2024 తర్వాత అత్యంత వేడి నెలగా అక్టోబర్ మారిపోయింది. అక్టోబర్ నెల సగటు ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 0.94 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.

India Experiences Third-Warmest October Since 1901 Amid Strong El Nino November will see more heat
IMD: వర్షాలు మర్చిపోండిక- వడగాల్పులు ఎక్స్ ట్రా-ఐఎండీ షాకింగ్ రిపోర్ట్..!
IMD: వర్షాలు మర్చిపోండిక- వడగాల్పులు ఎక్స్ ట్రా-ఐఎండీ షాకింగ్ రిపోర్ట్..!

దేశంలోని దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఇక్కడ పగలు, రాత్రి సగటు ఉష్ణోగ్రతలు చూస్తే 1901 తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. గత 15 ఏళ్లలో నమోదైన అత్యంత వేడి అక్టోబర్ నెలల్లో ఐదుసార్లు ఈ దక్షిణ ద్వీపకల్పన ప్రాంతంలోనే ఉండటం విశేషం. ప్రస్తుతం చాలా బలమైన ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని, ఇది మరింత బలపడి నవంబర్ నెలలో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గుతూ వస్తుందని, కానీ వచ్చే శీతాకాలం వరకు ఎల్ నినో ప్రభావంతోనే శీతాకాలం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు అక్టోబర్ నెలలో వర్షపాతం కూడా దీర్ఘకాలిక సగటు కంటే దాదాపు 31 శాతం తక్కువగా నమోదైంది. నవంబర్ నెలలో కూడా పగలు , రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో శీతాకాలం కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+