IMD: వర్షాలు మర్చిపోండిక- వడగాల్పులు ఎక్స్ ట్రా-ఐఎండీ షాకింగ్ రిపోర్ట్..!

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. అడపాదడపా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా వాటి ప్రభావం తాత్కాలికమే. ఇప్పటివరకూ కాస్తో కూస్తో కరుణించిన వర్షాలు ఇప్పుడు పూర్తిగా మాయం కాబోతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఎల్ నినో ప్రభావం మరింత పెరగనుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్ధితులు మరింత దారుణంగా మారే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (IMD) చెబుతోంది.

రాష్ట్రంలో ఈ నెలలో వర్షాలు బాగా తగ్గిపోతాయని, దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 40 శాతం వర్షపాట లోటు నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్లో రైతులు ఏ పంటలు వేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వేసుకున్న పంటలకు సైతం నీళ్లు అందక మరికొందరు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీంతో బోర్లతో నీళ్లు తోడేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా భారీగా తగ్గిపోతున్నాయి.

IMD Predicts Dry Spell Rising Heat Across Andhra Pradesh in September

ఇలాంటి తరుణంలో ఐఎండీ సెప్టెంబర్ నెలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. ఇందులో సెప్టెంబర్ మొదటి వారం పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, రెండో వారంలో అక్కడక్కడా జల్లుకు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత మాత్రం ఇక వర్షాలు మర్చిపోవచ్చని అమరావతి వాతావరణ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ ద హిందూకు వెల్లడించారు. ఈ పరిస్ధితులు కచ్చితంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాగే భూగర్భ జలాలు కూడా భారీగా పడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. దీంతో గత రెండు నెలలతో పోలిస్తే ఈ నెలలో రైతులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. మరి ప్రభుత్వం ఈ పరిస్ధితుల్ని ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై వ్యవసాయం ఆధారపడి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+